జాతీయ వార్తలు

జల సంపద కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: నీరు నిల్వ చేయడానికి ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంల నిర్మాణం తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావల్సి అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడి ఇండియన్ హేబిటేట్ సెంటర్‌లో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) హడ్కో 46వ్యవక స్థాపక దినోత్సవ వేడుకలను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. భవిష్యత్తు అవసరాలకు నీటిని నిల్వ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. పెరుగుతున్న పట్టణీకరణ నేపధ్యంలో పూర్వం నిర్మించిన చెరువులు, గుంతలు ఆక్రమణలకు గరవ్వడం వల్ల వర్షం నీరు వృధాగా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జల పరిరక్షణ చేపట్టాడానికి ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు.
తెలంగాణకు అవార్డుల పంట
హడ్కో 46వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రానికి వివిధ విభాగాల్లో మూడు అవార్డులను లభించాయి. నీటి సమస్యలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ప్రణాళికయుతంగా ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు సంస్థకు హడ్కో అవార్డు లభించింది. ఈ అవార్డును తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామరావుస్వీకరించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ కృష్ణా ఫెజ్-3, గోదావరి ఫెజ్ -1 ద్వారా హైదరాబాద్ అవసరాలకు సరిపోయే విధంగా నీటిని సరఫరా చేస్తూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకొంటున్నామని ప్రకటించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పని తీరును కనబర్చినందుకు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు హడ్కో అవార్డు లభించింది. ఈ అవార్డును తెలంగాణ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి అశోక్ కుమార్ అందుకున్నారు. బలహీన వర్గాల వారికి ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం, రుణాలను వేగవంతంగా అందించినందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు అవార్డు ఛైర్మన్ బిఆర్‌జి ఉపాధ్యాయ అందుకున్నారు.