జాతీయ వార్తలు

పార్టీ పటిష్ఠతకు కసరత్తు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: కాంగ్రెస్ పార్టీలో నిర్మాణాత్మక, సంస్థాగత మార్పులు చేసి పటిష్టం చేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఓడిపోవటం బాధారకమే అయితే మొత్తం మీద ఎన్నికల ఫలితాలు తమకు బాగానే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో గెలుపు, ఓటమి మామూలే, ఉత్తరప్రదేశ్‌లో కొంత దెబ్బతిన్నామని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. పంజాబ్‌లో విజయం సాధించాం, మణిపూర్, గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగినా బిజెపి చేసిన రాజకీయాల మూలంగా తమకు అధికారం రావటం లేదని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో రాష్టస్థ్రాయి నేతలు ఎన్నికల పోరాటం చేశారు, తమ ప్రాంతీయ నాయకులు పంజాబ్, గోవా, మణిపూర్‌లో విజయం సాధించారని ఆయన వివరించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి గురైంది, ఈ ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పార్టీలో పెద్దఎత్తున మార్పులు చేయాలని పార్టీ నాయకులందరూ ముక్తకంఠంతో వాదిస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదుర్కొన్న పరాజయాన్ని తీవ్రమైన అంశంగా పరిగణించకపోవటం పార్టీ నాయకులను ఆశ్చర్యంలో పడవేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 403 సీట్లుంటే కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లలో మాత్రమే గెలిచింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం పది అసెంబ్లీ సీట్లుంటే కాంగ్రెస్ కేవలం రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్నది. మిగతా ఎనిమిదిలో ఆరు బిజెపి గెలిస్తే, రెండు సీట్లను సమాజ్‌వాదీ పార్టీ దక్కించుకున్నది. ఈ పరిణామం గురించి కూడా రాహుల్ గాంధీ పెద్దగా స్పందించలేదు. ఇదిలావుండగా కొన్నా రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ ఎంతమాత్రం కారణం కాదని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. రాహుల్ గాంధీ చేయగలిగినంత చేశారు, ఆయన ఎప్పుడు కూడా బాధ్యతల నుండి పారిపోలేదని వారు వ్యాఖ్యానించారు. అయితే పార్టీని పటిష్టం చేసేందుకు అధినాయత్వం వీలున్నంత త్వరగా తగు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.