జాతీయ వార్తలు

ప్రతి కుటుంబానికో ఉద్యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, మార్చి 24: గత పదిహేను సంవత్సరాలుగా అసోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాలుగోసారీ పగ్గాలు చేపట్టేందుకు హామీల వర్షం కురిపిస్తోంది. తమ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వస్తే ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామన్న బలమైన హామీతో గురువారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. రానున్న ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పదిలక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని, ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కడితేనే సాధ్యమని ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ తెలిపారు. రెండున్నర లక్షల కంటే తక్కువ వార్షికాదాయం కలిగిన కుటుంబాలను పేద కుటుంబాలుగా పరిగణించి తదనుగుణంగా ప్రభుత్వ పరమైన ప్రయోజనాలను సమకూరుస్తామని తెలిపారు. అలాగే, స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని, రానున్న ఐదేళ్ల కాలంలో రెండు లక్షలకు పైగా టీచర్ పోస్టులను సృష్టిస్తామని తెలిపారు.అలాగే ఇదే కాలంలో ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పడంతో పాటు చిన్న వర్తకులకూ ఎన్నో రకాలుగా ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. తేయాకు రైతులకు ప్రత్యేక ప్యాకేజీని అందిస్తామని, అభివృద్ధి మండలుల ఏర్పాటుకు రెండు వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఎస్‌టిలు, ఎస్‌టిల అభున్నతి కోసం అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని, ప్రభుత్వ సబ్సిడీ దుకాణాల ద్వారా చక్కెరనూ ప్రజలకు పంపిణీ చేస్తామని వెల్లడించింది.