జాతీయ వార్తలు

కాలుష్యం వల్లే మలేరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశంలో అత్యధిక మలేరియా మరణాలు జీవించటానికి అనువుగా లేని పరిస్థితుల వల్లే జరుగుతున్నాయని ఎక్కువ మంది డాక్టర్లు అభిప్రాయ పడుతున్నారు. అంతర్జాతీయ మలేరియాదినం సందర్భంగా భారత్‌లో అతి పెద్ద డాక్లర్ల సమాజం ‘క్యూరోఫై’ నిర్వహించిన ఓ పోల్ సర్వేలో పాల్గొన్న డాక్టర్లలో 32శాతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తం 1300మంది డాక్టర్లు పాల్గొన్న ఈ సర్వేలో దేశ వ్యాప్తంగా జీవన అనుకూల పరిస్థితులు లేకపోవటం వల్ల మలేరియా మరణాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయని పేర్కొన్నారు. పరిశుభ్రం లేని వాతావరణం, కలుషిత మంచినీరు, బయటకు కనిపించే మురుగు కాల్వలు వ్యర్థ పదార్థాలను పడేసేందుకు సరైన వ్యవస్థ లేకపోవటం మలేరియా విజృంభణకు ముఖ్య కారణమని వైద్యులు అభిప్రాయ పడ్డారు. ‘ప్రజలు తమ చుట్టు పక్కల పరిశుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిండైన దుస్తులు ధరించటం, దోమ తెరలు వాడటం వంటివి కచ్చితంగా పాటించాలని సీనియర్ కన్సల్టంట్ డాక్టర్ పీకే ఝా పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోకపోవటం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని 23శాతం ఫిజిషియన్లు పేర్కొన్నారు. దేశంలో 1700 మందికి ఒక డాక్టర్ ఉన్నారని.. ఈ సంఖ్య చాలా తక్కువని తెలిపారు. విస్తృతంగా వ్యాపిస్తున్న మలేరియాను ఎదుర్కోవటం ఎలాగో చాలా మంది భారతీయులకు ఇవాల్టికీ అవగాహన లేదని 26శాతం మంది వైద్యులు అభిప్రాయ పడ్డారు. 18శాతం మంది డాక్టర్లు మాత్రం సరైన వైద్యం పూర్తిస్థాయిలో అందటం లేదని అభిప్రాయ పడ్డారు.