జాతీయ వార్తలు

కన్హయ్యకు పదివేల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సోమవారం వర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్, మరో పిహెచ్‌డి విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 9న యూనివర్శిటీ క్యాంపస్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అఫ్జల్‌గురుకు అనుకూలంగా నినాదాలు ఇచ్చినందుకు ఉమర్ ఖలీద్‌ను ఒక సెమిస్టర్ పాటు విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ చేయడంతో పాటు రూ. 20వేల జరిమానా విధించింది. ఈ కార్యక్రమానికే సంబంధించి విశ్వవిద్యాలయ క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించినందుకు కన్హయ్య కుమార్‌కు రూ. పదివేల జరిమానా విధించింది. ఉమర్ ఖలీద్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు ముజీబ్ గట్టూ, అనిర్బన్ భట్టాచార్యలను కూడా వర్శిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ముజీబ్‌ను రెండు సెమిస్టర్ల పాటు, అనిర్బన్‌ను జూలై 15నాటికి సస్పెండ్ చేశారు. అలాగే అనిర్బన్ వచ్చే అయిదేళ్ల పాటు యూనివర్శిటీలో ఎలాంటి కోర్సు చేయకుండా నిషేధం విధించారు. అశుతోష్ అనే విద్యార్థిని ఏడాది పాటు జెఎన్‌యు హాస్టల్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించడంతో పాటు అతనికి రూ. 20వేల జరిమానా విధించారు.