జాతీయ వార్తలు

వాస్తవాలను మరుగుపరచడానికే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఇషత్ జహాన్ కేసు అఫిడవిట్‌పై ప్రభుత్వం అనవసర రాద్ధాంత చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం విమర్శించారు. సమస్యను తప్పుదోవపట్టించడంలో భాగంగానే ఇదం తా చేస్తోందని సోమవారం ఆయన ఆరోపించారు. జహాన్‌ది ఎన్‌కౌంటరా? కాదా అన్నదాన్ని పక్కన బెట్టి బురదజల్లే చర్యకు దిగుతున్నారని ఆయన విమర్శించారు.‘కేసును నీరుగార్చడానికే ఇష్రాత్ జహాన్ అవిడవిట్ వివాదం సృష్టించారు. బూటకపుఎన్‌కౌంటర్‌లో నిందితులు కస్టడీ, అసలు విషయాన్ని తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారు’అని ట్విట్టర్‌లో చిదంబరం విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి ఆర్‌బిఐ గవర్నర్‌పై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అఫిడవిట్లకు సంబంధించి హోమ్ మంత్రి సంతకాలు చేయరని సీనియర్ కాంగ్రెస్ నేత చెప్పారు. అండర్ సెక్రెటరీనే సంతకాలు చేస్తారన్న విషయాన్ని ప్రభుత్వం మరుగునపెడుతోందని ఆయన ఆరోపించారు. ఎన్‌డిఏ ప్రభుత్వం చిన్న విమర్శలను కూడా భరించేపరిస్థితిలో లేదని, ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతోందన్నారు.