జాతీయ వార్తలు

రెండు నెలల్లో జిఎస్‌ఎల్‌వి మార్క్-3 ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 17: భారత్ మరో రెండు నెలల్లో దేశంలోనే అత్యంత శక్తివంతమైన లాంచ్ వెహికల్ జిఎస్‌ఎల్‌వి మార్క్-3ని ప్రయోగించబోతోందని సీనియర్ రోదసీ శాస్తజ్ఞ్రుడు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రొఫెసర్ టిజికె మూర్తి తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతిపై ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో శుక్రవారం పాల్గొన్న మూర్తి విడిగా ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ సమీప భవిష్యత్తులో భారత గడ్డపై నుంచి నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించబోతున్నట్లు చెప్పారు. జిఎస్‌ఎల్‌వి మార్క్-3లో ఉపయోగించే క్రయోజెనిక్ టెక్నాలజీని ఇస్రో విజయవంతంగా పరీక్షించిందని ఆయన తెలిపారు. ఇస్రో ఈ నెలలో సార్క్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తుందని, అనుగుణంగా సార్క్ సభ్యదేశాలు లబ్ధి పొందుతాయని ఆయన పేర్కొన్నారు.