జాతీయ వార్తలు

మాలేగావ్ పేలుళ్ల కేసులో తొమ్మిది మంది విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 25: మహారాష్ట్రంలోని మాలేగావ్‌లో 2006 సెప్టెంబర్‌లో జరిగిన పేలుళ్ల కేసులో తొమ్మిది మంది ముస్లిం యువకులపై దాఖలైన కేసును కోర్టు కొట్టివేసింది. ఈకేసుకు సంబంధించి నిందితులపై సాక్ష్యాధారాలు రుజువుచేయనందున సెష న్స్ జడ్జి వివి పాటిల్ తొమ్మిది మందిని నిర్దోషులుగా తీర్పునిచ్చారు. మాలేగావ్‌లో జరిగిన పేలుళ్ల ఘటనలో 37 మంది మృతి చెందారు. కేసును నుంచి తమకు విముక్తి కల్పించాలని చేసుకున్న పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఆమోదం తెలిపారు. కోర్టు తీర్పుపై ఆరోపణలు ఎదుర్కొన్న రరుూస్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశాడు. తీర్పులో ఆలస్యమైనప్పటికీ చివరికి న్యాయమే గెలిచిందని వ్యాఖ్యానించాడు. ఈ కేసు విచారణలో ఉండగానే ఒకరు చనిపోగా, ఆరుగురు బెయిల్‌పై విడుదలయ్యారు. మరో ఇద్దరు 2006 రైలులో పేలు ళ్ల కేసులో ముద్దాయిలు. తాజా పరిణామాలపై ఎఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎన్‌ఐఏ దర్యాప్తుపై విరుచుకుపడ్డారు. విచారణ తప్పులతడకగా సాగిందని విమర్శించారు. 2006 నాటి కేసులో విచారణ జరిపిన ఎన్‌ఐఏ తొమ్మిది మంది ముస్లిం యువకుల పాత్ర ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని గత వారం ముబయి కోర్టుకు తెలిపారు.