జాతీయ వార్తలు

సంపూర్ణ మద్యనిషేధం విధిస్తాం: కరుణానిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 25: తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని ద్రవిడ మునే్నట్ర కజగం అధినేత ఎం.కరుణానిధి ప్రకటించారు. మద్యపానం పట్ల ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని తాము అధికారంలోకి వచ్చిన తరువాత మొద టి సంతకం మద్యనిషేధ ఫైలుపైనే పెడతానని ఎన్నికల ప్రచార సభలో కరుణానిధి పేర్కొన్నారు. దశల వారిగా మద్యనిషేధం విధిస్తామన్న అన్నాడి ఎంకే చీఫ్ జయలలిత వాగ్దానాన్ని కరుణ ఎద్దేవా చేశారు. తాము సంపూర్ణ మద్యనిషేధానికి కట్టుబడి ఉన్నామన్నారు. 70వ దశకంలో ఆర్థిక ఆరోగ్యం కోసం నిషేధాన్ని కొంత సడలించినప్పటికీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన సందర్భంలో మద్యం అమ్మకాలను కట్టుదిట్టం చేశామని ఆయన అన్నారు. ఆ తరువాత అన్నాడీ ఎం కే అధికారంలోకి వచ్చి మద్యం అమ్మకాలను విచ్చలవిడి చేసిందన్నారు. తమిళనాడు యువత మద్యానికి బానిస అయ్యేలా అన్నాడీ ఎంకే చేసిందని ఆయన ఆరోపించారు.