జాతీయ వార్తలు

ప్రశాంత్ కిశోర్‌ని పట్టిస్తే 5లక్షలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 20: మూడేళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల సందర్భంలో స్టార్ ప్రచార వ్యూహ కర్తగా వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు యూపి కాంగ్రెస్ కార్యకర్తలకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. ప్రశాంత్ కిశోర్ ఎత్తుగడ వేస్తే చాలు తిరుగులేని విధంగా విజయం తథ్యమన్న మాట యూపిలో బెడిసికొట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ విజయానికి తన ప్రచార వ్యూహమే కారణమంటూ మార్కెటింగ్ చేసుకున్న ప్రశాంత్ ఆ తరువాత బీహార్‌లోనూ నితిశ్ మహాకూటమి విజయానికీ వ్యూహకర్తగా వ్యవహరించారు. రెండుచోట్లా ఘన విజయాన్ని సాధించటంలో ప్రశాంత్ తెలివితేటల్ని నమ్మి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ప్రచార వ్యూహకర్తగా నియమించుకుంది. కానీ ఏడే ఏడు సీట్లతో కాంగ్రెస్ సరిపెట్టుకోవలసివచ్చింది. దీంతో యుపి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశాంత్ కిశోర్‌పై మండిపడుతున్నారు. ప్రశాంత్‌కిశోర్‌ని పట్టి తెచ్చిన వారికి అయిదు లక్షలు ఇస్తామంటూ రాజేశ్‌సింగ్ అనే కాంగ్రెస్ కార్యకర్త రాష్ట్ర పార్టీ కార్యాలయం ముందు పెద్ద పోస్టర్ ఏర్పాటుచేశారు. తమకు నిజాయితీతో కష్టపడే కార్యకర్తలు ఉన్నప్పటికీ ప్రశాంత్ కిశోర్ తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తప్పుదోవ పట్టించటం వల్ల దారుణంగా పార్టీ ఓడిపోయిందని ఆయన ఆరోపించారు.

చిత్రం..లక్నో కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టర్