జాతీయ వార్తలు

విఐపి సంస్కృతికి చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 20: రాష్ట్రంలో ఎవరి పట్లా వివక్ష లేకుండా పనిచేస్తానని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిజ్ఞ చేశారు. సాధువు నుంచి రాజకీయవేత్తగా మారి ముఖ్యమంత్రిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆయన విఐపి సంస్కృతిని ప్రోత్సహించరాదని నిర్ణయించుకున్నారు. అదే తడవుగా సోమవారం ఆయన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రాష్ట్రంలోని మంత్రులెవరూ తమ వాహనాలపై ఎర్ర బుగ్గలను ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేశారని ‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక వెల్లడించింది. తమ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుందని ఆదిత్యనాథ్ పునరుద్ఘాటిస్తూ, రాష్ట్ర క్యాబినెట్‌లోని మంత్రులంతా 15 రోజుల్లోగా తమ ఆదాయంతో పాటు స్థిర, చరాస్తుల వివరాలను అందజేయాలని ఆదేశించారు.
శాంతిభద్రతల ప్రాధాన్యం
రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితిని మెరుగుపర్చడంలో ఏమాత్రం ఉదాసీనంగా వ్యవహరించరాదని ఆదిత్యనాథ్ సోమవారం రాష్ట్ర డిజిపి జావీద్ అహ్మద్‌ను ఆదేశించారు. అలహాబాద్‌లో ఆదివారం రాత్రి కొంత మంది దుండగులు బిఎస్‌పి నేత మహమ్మద్ షమీ (60)ని కాల్చి చంపిన కొద్ది గంటలకే ఆదిత్యనాథ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. షమీ హత్యకు గురికావడం పట్ల ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితిని మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతో ఉందని, తమ ప్రభుత్వం ముందున్న ప్రథమ ప్రాధాన్యత ఇదేనని తేల్చిచెప్పారు.
ఆదిత్యనాథ్ అధికారిక బంగళాపై సోమవారం ఉదయ భానుడి కిరణాలు ప్రసరించక ముందే కాషాయ దుస్తులు ధరించి అక్కడికి చేరుకున్న పలువురు సాధువులు ఆ బంగళాను శుద్ధిచేసి ఆయన గృహప్రవేశానికి మార్గాన్ని సుగమం చేశారు. గోరఖ్‌పూర్ నుంచి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. అయితే సాంప్రదాయ రీతిలో తగిన పూజలు, శుద్ధి కార్యక్రమాలు జరగనిదే అధికారిక నివాసంలో ప్రవేశించరాదని ఆయన నిర్ణయించారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలు పూర్తవడంతో శుభఘడియలు చూసుకుని అధికారిక నివాసంలో ప్రవేశించాలని ఆదిత్యనాథ్ భావిస్తున్నారు.

చిత్రం..లక్నోలో సోమవారం పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రులు దినేశ్ శర్మ, కేశవ ప్రసాద్ వౌర్య