జాతీయ వార్తలు

మాట్లాడుకుందాం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పఠాన్‌కోట్‌పై జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో అసలు భారత్-పాక్‌ల మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశం ఉందా అన్న అనుమానాల నేపథ్యంలో ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య మంగళవారం ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారు.ఇస్తాంబుల్ ప్రక్రియలో భాగంగా భారత్‌లో జరుగుతున్న ఒకరోజు సదస్సుకు హాజరు అవుతున్న పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి మంగళవారం భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జయ్‌శంకర్‌తో సమావేశం కానున్నట్టు ఇస్లామాబాద్ ప్రకటించింది. ఇస్తాంబుల్ ప్రక్రియ భేటీలో భాగంగానే ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని..ద్వైపాక్షిక సమగ్ర చర్చలకు సంబంధించి ఇప్పటి వరకూ సాధించిన పురోగతిని కూడా సమీక్షిస్తారని తెలుస్తోంది. భారత విదేశాంగ కార్యదర్శి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు సమగ్ర చర్చల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించాయి.
అయితే పఠాన్‌కోట్‌పై జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి కారణంగా ఆ చర్చలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. మంగళవారం ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య జరిగే సమావేశంలో పఠాన్‌కోట్ వ్యవహారం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని, అలాగే భారత దర్యాప్తు బృందం పాకిస్తాన్‌లో పర్యటించడానికి సంబంధించి కూడా ఐజాజ్-జయ్‌శంకర్‌లు చర్చించవచ్చునని చెబుతున్నారు.
సమగ్ర చర్చల ప్రక్రియగా పేర్కొంటున్న సిబిడి ప్రకటన అనంతరం ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ఇప్పటికే వీరి మధ్య చర్చలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ పఠాన్‌కోట్‌తో పాటు అనేక అంశాలు తీవ్ర ప్రతిబంధకంగా మారాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఆగిపోయినట్టేనంటూ పాకిస్తాన్ హైకమిషనర్ బాసిత్ చేసిన సంచలన ప్రకటన నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శుల సమావేశానికి ఆకస్మిక నిర్ణయం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు జరపాలన్నా ఉగ్రవాద నిరోధానికి సంబంధించి ఆ దేశ పాలకులు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సి ఉంటుందని భారత్ అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.