జాతీయ వార్తలు

తండ్రిని మించిన తనయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మార్చి 24: కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ రాజకీయ ప్రయాణం తన తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ అడుగుజాడల్లోనే సాగింది. రాజకీయ నైపుణ్యాన్ని, నాయకత్వ పటిమను తండ్రి నుంచి వారసత్వంగా పుణికి పుచ్చుకున్న మెహబూబా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరింతగా నిగ్గుదేలారు. పిడపిని బలమైన ప్రాంతీయ పార్టీగా తీర్చిదిద్దడంలోనూ, అలాగే రాష్ట్రంలో తిరుగులేని అధినేత్రిగా ఎదగడంలోనూ మెహబూబా ముఫ్తీ నిరుపమాన పట్టుదలనే కనబరిచారు. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్న 56ఏళ్ల మెహబూబా 1996లో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సమయంలోనే తండ్రీ కూతుళ్లిదరూ కాంగ్రెస్‌తోనే తమ రాజకీయ భవితకు పదును పెట్టుకున్నారు. అనంతర కాలంలో తండ్రిని మించిన తనయగా ఎదిగిన మెహబూబా పిడిపిని అట్టడుగు స్థాయి ప్రజలతో మమేకం చేయగలిగారు. తన తండ్రితో పాటు, తన తోటి రాజకీయ నాయకులందరి కంటే తనది భిన్నమైన శైలి అని మెహబూబా నిరూపించుకోవడానికి కారణం దిగువ స్థాయి వర్గాలతో ఆమె అన్ని విధాలుగా సన్నిహితం కావడం, అలాగే అరుదైన పాటవంతో రాజకీయ నైపుణ్యాన్ని కనబరచడం.1998లో కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసిన తన తండ్రి సరుూద్ విజయానికి మెహబూబా రాజకీయ నైపుణ్యం ఎంతగానో దోహదం చేసింది. ఏడాది తిరక్కుండానే అంటే 1999లో ఇద్దరూ కలిసి పిడిపిని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌లకు చెందిన ఎందరో అసంతృప్త నేతలు రావడంతో పిడిపి తొలి దశలోనే బలపడింది. అప్పటి నుంచి కొత్త పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడానికి మెహబూబా శక్తివంచన లేకుండా కృషి చేశారు. తాజాగా రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోవడం వెనుక ఆమె కృషి, అకుంఠిత దీక్షా దక్షతలు ఉన్నాయనడం అతిశయోక్తి ఏమీ కాదు.