జాతీయ వార్తలు

ఇక రెండోదశ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, మార్చి 26: దేశంలో నల్లధనం, అవినీతి నిర్మూలనలో తదుపరి దశ పోరాటం మొదలవుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ పోరాటంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతినెలా జాతినుద్దేశించి మోదీ రేడియో ద్వారా చేసే మన్‌కీ బాత్ కార్యక్రమంలో పలు విషయాలను ఆయన చర్చించారు. అవినీతిపై పోరాటంలో భాగంగా ప్రజలు నగదు లావాదేవీలను తక్కువ చేయాలని డిజిటల్ చెల్లింపుల ఉద్యమానికి ఊతమివ్వాలని కోరారు. ఇందుకోసం 125కోట్ల మంది ప్రజలు ప్రతినపూనాలన్నారు. స్కూల్ ఫీజులు, మందుల కొనుగోళ్లు, విమాన, రైలు టిక్కెట్లను నగదు రహితంగా కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘మనం రోజూవారి కార్యక్రమంలో ఇది చాలా సులువుగా చేసేయొచ్చు. దీని ద్వారా మీరు దేశానికి ఎంత సేవ చేస్తున్నారో ప్రత్యక్షంగా మీకు తెలియదు. ఈ రూపంలో నల్లధనంపై పోరాటం చేసే సైనికులుగా మీరు మారతారు.’’ అని మోదీ పేర్కొన్నారు. దేశంలో ఈ సంవత్సరం 2500 కోట్ల డిజిటల్ చెల్లింపులు అవుతాయని బడ్జెట్ అంచనా వేసిందని, 125కోట్ల మంది భారతీయులు తలచుకుంటే ఇది పెద్ద లక్ష్యమేం కాదని ఆయన అన్నారు. ఇందుకు ఏడాది కూడా వేచి చూడాల్సిన అవసరం లేదని, ఆరు నెలల్లోనే లక్ష్యాన్ని సాధించవచ్చని మోదీ వ్యాఖ్యానించారు. డిజిధన్ ఉద్యమంలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వాములు కావటం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో పేదల్లోకెల్లా పేదలు నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు క్రమంగా ఈ దిశగా అడుగులు కదుపుతున్నారని ఆయన అన్నారు. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి భిమ్ యాప్‌ను వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ యాప్‌ను ఇప్పటికే కోటిన్నర మంది డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు.
స్వచ్ఛ్భారత్ కార్యక్రమం గురించి కూడా మోదీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు మోదీ అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్ భారత్‌కు మంచి మిత్ర దేశమని ఆయన అన్నారు. మన జాతీయ గీతంతో పాటు బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని సైతం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించటం గర్వకారణమని మోదీ అన్నారు. 1919లో జలియన్‌వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో తన నైట్‌హుడ్ బిరుదును వదులుకోవటం ఒక యువకుడికి స్ఫూర్తినిచ్చిందని, అతను భగత్‌సింగ్ అని ఆయన అన్నారు. 1917నాటి చంపారన్ సత్యాగ్రహాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. గర్భిణీ స్ర్తిలకు మెటర్నిటీ సెలవును 26వారాలకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను పిలుపు ఇచ్చిన నవ భారత్ ప్రభుత్వ పథకం కాదని, ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కానే కాదని మోదీ స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ నవ భారత నిర్మాణానికి పాటుపడాలని ఆయన కోరారు.