జాతీయ వార్తలు

నేడు పార్లమెంట్‌కు జిఎస్‌టి బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) శాసనాలకు సంబంధించిన బిల్లులను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది.జి-జిఎస్‌టి, ఐ-జిఎస్‌టి, యుటి-జిఎస్‌టి, నష్టపరిహార చెల్లింపునకు సంబంధించి వీటిని రేపే లోక్‌సభలో ప్రవేశ పెట్టి 28కల్లా చర్చనూ చేపట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వీటితో పాటు ఎక్సైజ్, కస్టమ్స్ చట్ట సవరణలను కూడా సభ ముందుంచే అవకాశం ఉంది. ఇందుకోసం సభా వ్యవహారాల కమిటీ సోమవారం ఉదయమే సమావేశమై ఈ బిల్లులపై ఎంత వ్యవధిపాటు చర్చించాలన్న అంశాన్ని నిర్థారించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 29 లేదా మార్చి 30లోగా దిగువ సభలో జిఎస్‌టి బిల్లుల ఆమోద ప్రక్రియను ముగించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. అనంతరం వీటిని రాజ్యసభ ఆమోదానికి నివేదిస్తారు. రాజ్యసభ సవరణలు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తితే మళ్లీ ఆ బిల్లులను లోక్‌సభకు తీసుకొచ్చేందుకూ ప్రభుత్వానికి తగిన వ్యవధి ఉంటుంది. ఈ సవరణలను లోక్‌సభ ఆమోదించేందుకూ లేదా తిరస్కరించేందుకూ ఆస్కారం ఉంటుంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 12 వరకూ జరుగుతాయి. మనీ బిల్లులుగానే వీటిని ప్రవేశ పెడుతున్నప్పటికీ ఉభయ సభల్లోనూ సమగ్ర చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి.