జాతీయ వార్తలు

పరాన్నభుక్కుగా ఉండటం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: గృహ హింస కేసులో ఒక మహిళకు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర భృతిని పెంచడానికి నిరాకరించిన ఢిల్లీ కోర్టు ఏ పని చేయకుండా ఆమె ఇంట్లో కూర్చోవాలని అనుకోవడం కానీ, భర్త రాబడిపై ఆధారపడి పరాన్నభుక్కుగా బతకడం కానీ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. తనకిప్పుడిస్తున్న రూ 5,500 రూపాయల మధ్యంతర భృతిని 25 వేల రూపాయలకు పెంచాలని కోరుతూ ఆ మహిళ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తిరస్కరించిన అదనపు సెషన్స్ జడ్జి ఆర్‌కె త్రిపాఠీ భర్తకన్నా ఆమెకే ఎక్కువ విద్యార్హతులున్నాయని వ్యాఖ్యానించారు. ఫిర్యాదుదారు ఎంఏ బిఇడితో పాటుగా ఎల్‌ఎల్‌బి కూడా చేసిందని, భర్తకన్నా ఆమెకే ఎక్కువ క్వాలిఫికేషన్లున్నాయన్న జడ్జి ఆమె స్వయంగా సంపాదించుకోగలదని, భర్త సంపాదనపై ఆధారపడి, పరాన్ని జీవిగా బతకడం సరికాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 2008లో మేజిస్ట్రేట్ కోర్టు ఆ మహిళకు 5 వేల రూపాయల తాత్కాలిక భృతిని మంజూరు చేయగా, 2015లో ఆ మొత్తాన్ని పది శాతం పెంచారు కూడా. తన భృతిని ఎందుకు పెంచాలో ఫిర్యాదుదారు సరయిన కారణాలు చూపలేకపోయారని, అలాగే తన ఖర్చులు పెరిగాయని కానీ లేదా భర్త రాబడి పెరిగిందని కానీ ఆమె నిరూపించలేకపోయారని త్రిపాఠీ అభిప్రాయపడ్డారు.