జాతీయ వార్తలు

లైంగిక ఆరోపణలపై కేరళ మంత్రి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోజికోడ్/తిరువనంతపురం, మార్చి 26: పట్టుమని పది నెలలు కూడా పూర్తికాకుండానే కేరళలో సిపిఎం సారథ్యంలోని వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్ ప్రభుత్వానికి ఓ పెద్ద చిక్కే ఎదురైంది. ఒక మహిళతో అసభ్యంగా లైంగిక వ్యాఖ్యాలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎ.కె.శశీంద్రన్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆశ్రీత పక్షపాతానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పరిశ్రమల మంత్రి ఇ.పి.జయరాజన్ రాజీనామా ప్రభావం నుంచి కోలుకోని రాష్ట్ర ప్రభుత్వానికి శశీంద్రన్ రాజీనామా పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. తమ సమీప బంధువులైన ఇద్దరికి రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో కీలక పదవులు కట్టబెట్టారన్న ఆరోపణలపై ఇ.పి.జయరాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 12న మలప్పురం ఉపఎన్నిక జరుగుతున్న తరుణంలో స్వల్ప వ్యవధిలోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం ప్రతిపక్ష యుడిఎఫ్‌కు అధికార పక్షంపై ధ్వజమెత్తేందుకు బలమైన ఆయుధం లభించినట్లయింది. ఐయుఎంఎల్ నాయకుడు ఇ.అహ్మద్ మరణంతో ఈ ఉపఎన్నిక జరపాల్సి వచ్చింది. ఓ మహిళతో టెలిఫోన్ సంభాషణలు జరిపిన శశీంద్రన్ లైంగిక వ్యాఖ్యలు చేశారంటూ రికార్డయిన టెలిఫోన్ క్లిప్పింగులను మంగళం అనే టెలివిజన్ చానల్ ఆదివారం ఉదయం బైటపెట్టింది. ఆ సమయంలో కోజికోడ్‌లో ఉన్న మంత్రి తన కార్యక్రమాలను రద్దు చేసుకుని మధ్యాహ్నం 3.00 గంటల ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించి, అక్కడే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాను రాజీనామా చేసినంత మాత్రాన తనపై వచ్చిన ఆరోపణలు నిజమని అంగీకరిస్తున్నట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.

చిత్రం..ఎ.కె.శశీంద్రన్