జాతీయ వార్తలు

మోసానికి తావు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ఉన్న విశ్వసనీయత ప్రపంచంలో మరే దేశంలోనూ లేవని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వీటిలో మార్చటానికి కానీ, మోసం చేసేందుకు కానీ, టాంపరింగ్ చేయటానికి కానీ ఎలాంటి ఆస్కారం లేదని స్పష్టం చేసింది. ఇటీవల అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తరువాత బిఎస్పీ అధినేత్రి మాయావతి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ఈవీఎంల విశ్వసనీయతపై ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ యంత్రాలు ఎప్పుడూ మారవని, రాజకీయ నాయకులే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. ‘దేశ ఎన్నికల ప్రక్రియలో పురోగతిలో ఎంతో నమ్మదగిన యంత్రాలు ఈవిఎంలని ఎన్నికల సంఘం పునరుద్ఘాటిస్తోంది. వీటిలో మోసం చేయటానికి, మార్పులు చేర్పులు చేయటానికి ఏ విధమైన అవకాశం లేదు. నేతల ఆరోపణలన్నీ నిరాధారాలు, ఊహాజనితమైనవి. వీటిని తిరస్కరించాల్సిందే. విజేత ఫలితాలను స్వీకరిస్తారు. పరాజితులే ఈ రకమైన ఆరోపణలు చేస్తారు’ అని ఈసీ పేర్కొంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రూకారం ఇప్పటివరకు రాష్ట్రాల్లో 107 ఎన్నికలను, మూడు పార్లమెంట్ ఎన్నికలను సాఫీగా నిర్వహించారు. 2014 ఎన్నికల్లో దాదాపు పది లక్షల ఈవీఎం యూనిట్లను వినియోగించారు. ఇవన్నీ పూర్తి భద్రతతో కూడుకున్నవి. అమెరికాసహా చాలా దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్‌లనే వాడుతున్నాయని ఈసీ తెలిపింది. భారత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బ్యాటరీ పవర్‌తో తెలుపు కలర్‌లో ఒక మామూలు కాలిక్యులేటర్‌గా లేక ఒక సాధారణ కీబోర్డ్ ప్లేయర్ మాదిరిగానే ఉంటుందని ఈసి వివరించింది. ఈవిఎంలను మూడు జనరేషన్‌లలో తయారు చేశారని, తొలి జనరేషన్ తిరస్కరణకు గురికాగా ఇప్పుడు రెండు, మూడు జనరేషన్ల యంత్రాలను వినియోగిస్తున్నారని పేర్కొంది. సమాచారాన్ని పదిలంగా భద్రపరచగల సామర్థ్యం వీటిలో పుష్కలంగా ఉందని స్పష్టం చేసింది.
బాకీలున్న పార్టీలపైనా వేటేద్దామా?
వినిమయ బిల్లుల బకాయిలు చెల్లించడంలో విఫలమైన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంచాలని ప్రతిపాదించిన ఇసి ఇప్పుడు రాజకీయ పార్టీల విషయంలోనూ ఇదే విధమైన చర్యలు చేపట్టాలని భావిస్తోంది. దీనిపై అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ లేఖలు రాసింది. కేవలం అభ్యర్థులే కాకుండా వారిని బరిలోకి దింపడానికి ముందు రాజకీయ పార్టీలు కూడా ‘నో డ్యూస్’ సర్ట్ఫికెట్లు సమర్పించాలన్న ఢిల్లీ హైకోర్టు ఆ దేశాన్ని ఏ విధంగా అమలు చేయాలని ఎన్నికల కమిషన్ ఆ లేఖల్లో ప్రశ్నించింది. లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగే అభ్యర్థులు విద్యుత్, టెలిఫోన్, నీటి కనెక్షన్ల లాంటి వసతులు సహా ఇతర వినిమయ బిల్లులకు సంబంధించిన బకాయిలేవీ లేవని ధ్రువీకరణ పత్రాలు సమర్పించేలా చూడాలని ఢిల్లీ హైకోర్టు 2015 ఆగస్టులో ఎన్నికల కమిషన్‌కు సూచించడంతోపాటు ఇదే నిబంధనను రాజకీయ పార్టీలకు కూడా వర్తింపజేయాలని స్పష్టం చేసింది.