జాతీయ వార్తలు

12 నెలల జీతం తీసుకోవచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: కుటుంబ అవసరాలు, ఖర్చుల నిమిత్తం ఉద్యోగులు తమ పెన్షన్ ఫండ్‌ను వాడుకునేందుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఇప్పటి వరకూ ఉద్యోగులు తమ పెన్షన్ నిధిలోని మొత్తంలో మూడు నెలల జీతానికి సరిపడ నిధుల్ని లేదా సగం మొత్తాన్ని తీసుకునేందుకు అవకాశం ఉండేది. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగి తమ పెన్షన్ నిధిలో ఉన్న మొత్తంలో పనె్నండు నెలల జీతాన్ని లేదా నాలుగింట మూడొంతుల మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వెసులుబాటును ఉపయోగించుకునేందుకు ఇప్పటి వరకూ ఉన్న పదిహేను సంవత్సరాల సర్వీసు నిబంధనను పదేళ్లకు తగ్గించారు. విద్య, వైద్యం, వినియోగ వస్తువుల కొనుగోలు, ఇతర అత్యవసర ఖర్చుల నిమిత్తం పెన్షన్ మొత్తాన్ని తీసుకునే వీలుంటుంది. అలాగే పిల్లల ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత విద్యావసరాల నిమిత్తం కూడా ఈ నిధుల్ని విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించింది. హౌసింగ్, హౌసింగ్ రుణాల చెల్లింపు, భూమి కొనుగోలు, ఇళ్ల పునరుద్ధరణ వంటి అవసరాల కోసం తీసుకునే మొత్తం పరిమితిని కూడా పెంచింది.