జాతీయ వార్తలు

విమానం ఎక్కనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు విమానయాన కష్టాలు తీరడం లేదు. ముంబై నుంచి ఢిల్లీకి బుధవారం వచ్చేందుకు బుక్ చేసుకున్న విమాన టిక్కెట్‌ను ఎయిరిండియా రద్దు చేసింది. తనకు బిజినెస్ క్లాస్ సీట్ ఇచ్చేందుకు నిరాకరించిన ఎయిరిండియా మేనేజర్ ఆర్ సుకుమార్‌ను చెప్పుతో కొట్టిన ఘటనపై ఎయిరిండియా సహా ఐదు విమానయాన సంస్థలు ఏకమయ్యాయి. గైక్వాడ్‌కు ఎట్టి పరిస్థితిలోనూ విమానయాన సేవలు అందించరాదని తీవ్ర నిర్ణయం తీసుకున్నాయి. ఎయిరిండియాతో పాటు ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్ ఆసియా, విస్తారా సంస్థలన్నీ గైక్వాడ్‌ను విమాన ప్రయాణానికి అనుమతించరాదని నిర్ణయించాయి. బుధవారం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు రెండు రకాలుగా గైక్వాడ్ టిక్కెట్ బుక్ చేసుకున్నారు. కానీ రెండు ప్రయత్నాలనూ ఎయిరిండియా తిప్పికొట్టింది. రెండు టిక్కెట్లనూ రద్దు చేసింది. మొదట ఎయిరిండియా కాల్‌సెంటర్ ద్వారా బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లే విమానంలో గైక్వాడ్ బ్లాక్ చేసి పెట్టారు. తరువాత ప్రయాణికుడు ఎవరన్నదీ తెలుసుకున్న తరువాత ఎయిరిండియా ఆ టిక్కెట్‌ను రద్దు చేసింది. గైక్వాడ్ అంతటితో ఊరుకోలేదు. ఈసారి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే విమానాన్ని ఆయన బుక్ చేశారు. ఈసారీ సిబ్బంది ఆయన పేరును కనుక్కొని టిక్కెట్ రద్దు చేశారు. గైక్వాడ్ ఎన్ని టిక్కెట్లు బుక్ చేశారో డాటాబేస్ పరిశీలించి చెక్ చేయాలని ఎయిరిండియా తన ప్రాంతీయ సిబ్బందికి ఆదేశాలిచ్చింది. ‘గైక్వాడ్ ఎన్ని టిక్కెట్లు బుక్‌చేశారో చెక్ చేస్తున్నాం. ఆన్‌లైన్‌లో కూడా ఆయన పేరును నమోదు చేసి ఉంచాం. అతను ఎక్కడి నుంచి ఏవిధంగా టిక్కెట్ బుక్ చేసుకున్నా మా సిబ్బంది కనిపెడతారు’ అని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. తమ సిబ్బందిని చెప్పుతో కొట్టడమే కాకుండా బేషరతు క్షమాపణ చెప్పమన్నా చెప్పకపోవటంతో విమానయాన సంస్థలు తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పైగా తానెందుకు పశ్చాత్తాప పడాలో చెప్పాలని గైక్వాడ్ అన్నారు. ‘నేనెందుకు పశ్చాత్తాపం చెందాలి? నేను క్షమాపణ చెప్పను. అతను (సుకుమార్) వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి. అప్పుడు ఆలోచిస్తా.. అరవై ఏళ్ల వ్యక్తికి ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి’ అని అన్నారు. తాను బిజెనెస్ క్లాస్ సీట్ ఇవ్వాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని, సరైన సర్వీసు ఇవ్వటం లేదంటూ ఫిర్యాదు చేసేందుకు కంప్లయింట్ బుక్ మాత్రమే ఇవ్వాలని కోరానని తెలిపారు. ఎయిరిండియా అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఉస్మానాబాద్ ఎంపీ అయిన గైక్వాడ్ విమానయాన సంస్థలు తనను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో శుక్రవారం సాయంత్రం ఆయన రైల్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. సోమవారం లోక్‌సభలో దీనిపై చర్చ జరిగినా, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు.