జాతీయ వార్తలు

రాష్టప్రతి పదవికి అభ్యర్థిని నిలబెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయనున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వారసుడి ఎంపిక వ్యవహారం క్రమంగా వేడెక్కుతోంది. ఈ పదవికి తమ సొంత అభ్యర్థిని బరిలోకి దింపుతామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. శివసేన ప్రతిపాదిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ అభ్యర్థిత్వాన్ని తాము బలపరచడం లేదని తేల్చిచెప్పింది. అంతర్గతంగా చర్చించిన తర్వాత కచ్చితంగా తమ అభ్యర్థిని రాష్టప్రతి పదవికి పోటీకి పెడతామని, కాషాయ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్న తాము భాగవత్‌ను బలపరిచే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ గగోయ్ మంగళవారంనాడిక్కడ మీడియాకు తెలిపారు.
ప్రణబ్ ముఖర్జీ వారసుడి ఎంపికలో విపక్షాలు విభేదాలు వీడి ఏకాభిప్రాయంతో ముందుకు వస్తాయా అన్న ప్రశ్నకు త్వరలోనే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత చర్చలు జరుపుతుందని జవాబిచ్చారు. ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎన్‌డిఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలకు విందు ఇస్తున్నారు. దీని ఉద్దేశం రాష్టప్రతి పదవికి పోటీ చేసే ఎన్‌డిఎ అభ్యర్ధికి మద్దతు సమీకరించాలన్నదేనని అభిజ్ఞ వర్గాల కధనం.