జాతీయ వార్తలు

త్వరలో ‘నో ఫ్లయర్స్’ జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: దురుసుగా, దౌర్జన్యంగా, అనాగరికంగా ప్రవర్తించే విమాన ప్రయాణికుల పేర్లతో ‘‘నో ఫ్లయర్స్’’ జాబితాను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో పాటు ఇతరత్రా ఇలాంటి వారిపై ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్న దానిపై దృష్టి పెట్టింది. ఎయిరిండియా ఉద్యోగిని కొట్టిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ ఏ విమానంలోనూ ప్రయాణించకుండా విమానయాన సంస్థలు నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తలపెట్టింది. అయితే విమాన ప్రయాణానికి సంబంధించి ప్రయాణికుల ప్రవర్తన విషయంలో ఏరకమైన చర్యలు తీసుకోవాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా నో ఫ్లయర్స్ జాబితాపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు పౌర విమానయాన సంస్థకు చెందిన ఈ అధికారి వెల్లడించారు. ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఎలాంటి చర్యనైనా తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించారు. అయితే నోఫ్లయర్స్ జాబితాపై ఇప్పటికిప్పుడు తానెలాంటి వ్యాఖ్య చేయబోనని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్ ఎన్ చౌబె తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి స్పష్టత తీసుకువస్తామన్నారు.