జాతీయ వార్తలు

గ్రేటర్ నోయిడాలో ఆఫ్రికన్లపై దాడి ఘటనలో ఐదుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయిడా/న్యూఢిల్లీ, మార్చి 28: గ్రేటర్ నోయిడాలో సోమవారం ఆఫ్రికన్లపై దాడి సంఘటనకు సంబంధించి అయిదుగురిని అరెస్టు చేశారు. కాగా, ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దాడికి పాల్పడిన వారిపై కటిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పరిస్థితి ప్రాణాలకు ముప్పు కలిగించేదిగా ఉందని అంటూ ఓ ఆఫ్రికా విద్యార్థి తక్షణం చర్యలు తీసుకోవాలని సుష్మాస్వరాజ్‌ను కోరడంతో ఆమె యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా ఈ దాడులను గర్హనీయమైనవిగా విదేశాంగ శాఖ అభివర్ణించింది. వారం రోజుల క్రితం డ్రగ్స్ ఓవర్‌డోస్ కారణంగా ఎన్‌ఎస్‌జి బ్లాక్‌క్యాట్స్ ఎన్‌క్లేవ్‌లో మనీష్ అనే 17 ఏళ్ల యువకుడు మృతి చెందడానికి నిరసనగా గ్రేటర్ నోయిడా ప్రాంత వాసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ర్యాలీలోని కొంతమంది వ్యక్తులు నైజీరియన్లపై దాడి చేశారు. మనీష్ మృతికి సంబంధించి అరెస్టు చేసిన కొంతమంది నైజీరియన్లను పోలీసులు విడుదల చేసిన తర్వాత ఈ దాడి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి విదేవాంగ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు నైజీరియా దౌత్య కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

చిత్రాలు..మంగళవారం గ్రేటర్ నోయడా ఎస్పీతో సమావేశమైన ఆఫ్రికన్లు
*మనీష్ మృతికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన దృశ్యం