జాతీయ వార్తలు

ఏకాభిప్రాయంతోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: వస్తుసేవల పన్ను (జిఎస్‌టి)పై ఏకపక్షంగా ముందుకు వెళ్లేది లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లులపై ఏకాభిప్రాయ ప్రాతిపదికనే ముందుకు వెళ్తామని మంగళవారం నాడిక్కడ జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జైట్లీ స్పష్టం చేసినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ వెల్లడించారు. జిఎస్‌టికి సంబంధించిన నాలుగు కీలక బిల్లులను ఈ సమావేశంలో జైట్లీ ఎంపీలకు వివరించారు. జిఎస్‌టి కౌన్సిల్‌లో విస్తృత చర్చ అనంతరమే వీటి ముసాయిదాలను రూపొందించినట్టు జైట్లీ స్పష్టం చేశారని కుమార్ మీడియాకు తెలిపారు. అలాగే వీటివల్ల రాష్ట్రాలకు ఏ రకమైన ప్రయోజనం కలుగుతుందోకూడా జైట్లీ తన ప్రసంగంలో విపులీకరించినట్టు చెప్పారు. ఒకే దేశం-ఒకే పన్ను విధానం అనే ప్రాతిపదికనే జిఎస్‌టిని రూపొందించామని వీటివల్ల సామాన్యుడికి అనేక రకాలుగా లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
మేం అంగీకరించం: కాంగ్రెస్
ప్రస్తుత రూపంలో జిఎస్‌టి బిల్లును తాము అంగీరించేది లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అయితే మొత్తం జిఎస్‌టి ఆలోచనకే తాము వ్యతిరేకం అన్న అభిప్రాయం కలిగించకుండా ఆచితూచి స్పందించింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఎంపీల సమావేశంలో ఈ అంశాన్ని చర్చించారు. జిఎస్‌టిపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను సభలో స్పష్టం చేయాలని అలాగే కొన్ని సవరణలను కూడా ప్రతిపాదించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జిఎస్‌టికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని పార్టీ ఎంపీలకు రాహుల్ స్పష్టం చేసినట్టు తెలిసింది.

చిత్రం..ఢిల్లీలో మంగళవారం జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ