జాతీయ వార్తలు

కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మార్చి 28: కాశ్మీర్‌లో బుద్గాం జిల్లాలో భద్రతా దళాల చేపట్టిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో ముగ్గురు పౌరులు మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. కాగా, భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లు హతమైనారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి సమీపంలో నిరసనలకు దిగిన ప్రజలపై భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ఈ సంఘటన జరిగింది. ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ ముగిసిందని సైనికాధికారి ప్రకటించిన కొద్ది వ్యవధిలోనే ప్రజలు నిరసనలకు దిగడంతో ఈ సంఘటన చోటు చేసుకొంది. విధులు నిర్వహిస్తున్న దళాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణార్థం వారిపై చర్యలు చేపట్టాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. దుర్భుమ్ ప్రాంతంలో మిలిటెంట్లు చొరబడ్డారన్న సమాచారం అందడంతో మంగళవారం ఉదయమే భద్రతా దళాలు అక్కడికి చేరుకున్నాయి. దళాలు జరిపిన గాలింపు చర్యలు మిలిటెంట్లపై ఎదురుకాల్పులకు దారితీశాయి. ఎన్‌కౌంటర్ ముగిసిన వెంటనే ప్రజలు అక్కడికి చేరుకుని జవాన్లపై రాళ్లు రువ్వడం ప్రారంభించడంతో వారిని చెదరగొట్టడానికి కాల్పులు జరపాల్సి వచ్చింది.

చిత్రాలు.. జమ్ము కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఓ ఇంటిలో నక్కిన మిలిటెంట్లను ఎదుర్కొనేందుకు పొంచివున్న భద్రతా దళాలు. మిలిటెంట్లు దాగివున్న ఇంటిపై సైనికులు గ్రెనేడ్ విసరడంతో ఎగజిమ్ముతున్న పొగ.