జాతీయ వార్తలు

హైవేల్లో మద్యం అమ్మకాల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ ముంబయి, ఏప్రిల్ 2: హైవేల పక్కన మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అధికారులు రంగంలోకి దిగారు. దీంతో హైవేల పక్కన గల వేలాది పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు మద్యం సరఫరాను నిలిపివేశాయి. మరోపక్క, దీని ఫలితంగా తాము కోల్పోతున్న ఆదాయాన్ని లెక్కగట్టుకునే పనిలో రాష్ట్రాలు ఉన్నాయి. ఢిల్లీలో నగరం మీదుగా పోతున్న ఆరు జాతీయ రహదారుల పక్కన గల వంద రెస్టారెంట్లు, వైన్‌షాప్‌లు, బార్లతోపాటు అయిదు నక్షత్రాల హోటళ్లు మద్యం సరఫరాను నిలిపివేశాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మరిన్ని చర్యలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే, అనేకమంది తమ ఔట్‌లెట్లు రహదారి నుంచి 500 మీటర్లలోపు దూరంలో లేవని పేర్కొంటూ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. హేవేల పక్కన 500 మీటర్ల లోపు దూరంలో మద్యం అమ్మకాలను అత్యున్నత న్యాయస్థానం నిషేధించిన విషయం తెలిసిందే. పొరుగున ఉన్న నోయిడాలో 42 ఔట్‌లెట్లలో మద్యం అమ్మకాలను నిలిపివేశారు. గురుగ్రామ్‌లో 292 బార్లు ఉండగా, వాటిలో 106 బార్లపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం పడిందని అధికారులు చెప్పారు.
మహారాష్టల్రో కనీసం వెయ్యి స్టార్ హోటళ్లపై హైవేల పక్కన మద్యం అమ్మకాల నిషేధ ప్రభావం పడిందని ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎహెచ్‌ఎఆర్) అధ్యక్షుడు ఆదర్శ్ శెట్టి తెలిపారు. వీటిలో నగరంలోని డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌లో గల విఐపి లాంజ్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. మద్యం అమ్మకాలపై విధించిన ఈ నిషేధం వల్ల ఏటా ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కోల్పోతున్న ఈ ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి చంద్రశేఖర్ బవంకులే చెప్పారు.
ఎక్కువ మద్యం వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఒకటయిన కేరళలో 1,956 మద్యం బార్లు, కల్లు దుకాణాలపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం పడింది. అయితే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తామని కేరళ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జి.సుధాకరన్ స్పష్టం చేశారు.