జాతీయ వార్తలు

సంక్షేమం.. విప్లవాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు విప్లవాత్మకమైనవని భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తూ ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు కొనసాగడానికి 2019లో కూడా ఆయనను అధికారంలోకి తీసుకువస్తామని ప్రతినబూనాలని ప్రజలను కోరింది. ఇక్కడ రెండు రోజులుగా జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల చివరి రోజయిన ఆదివారం నాడు ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. మోదీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని చెప్పడానికి వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును తీసుకురావడం, ఆరోగ్య విధానం, జన్‌ధన్ ఖాతాలకు ముద్రా రుణాలు ఇవ్వడం లాంటి చర్యలను ఆ తీర్మానం ఉదహరించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న కారణంగా ఒకప్పుడు దివంగత ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో పేదల పార్టీగా కాంగ్రెస్ పార్టీకున్న గుర్తింపు ఇప్పుడు తమ పార్టీ వైపునకు మళ్లుతోందని స్పష్టం చేసింది. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రజలు కులం, మతం ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కోసం ఓటు వేయడం ప్రారంభించారని పార్టీ పేర్కొంటూ, తమ వాదనను సమర్థించుకోవడానికి ఉత్తరప్రదేశ్‌లో పార్టీ సాధించిన ఘనవిజయం, మణిపూర్‌లో అధికారం చేపట్టే స్థాయికి పార్టీ ఎదగడాన్ని ఉదాహరణగా పేర్కొంది. ప్రభుత్వం అధిక వృద్ధి రేటును సాధించగలగడంతో పాటుగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసిందని కూడా ఆ తీర్మానం పేర్కొంది.
సమావేశాల వివరాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ విలేఖరులకు వివరిస్తూ, సాధారణంగా మూడేళ్లు గడిచాక ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమవుతుందని, అయితే కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచాక కూడా ఉత్తరప్రదేశ్‌లో బిజెపి తన 40 శాతం ఓటింగ్ వాటాను కొనసాగించడం విశేషమని, ప్రభుత్వ పాపులారిటీకి ఇది నిదర్శనమని అన్నారు. నరేంద్ర మోదీ దేశాన్ని శరవేగంగా, నిలకడయిన ఆర్థికాభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, దేశాన్ని స్వయం సమృద్దం, ప్రగతిశీల దేశంగా చేయడానికి అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారని ఆ తీర్మానం పేర్కొంది. ప్రతి రంగంలో ప్రభుత్వం గొప్పగా రాణిస్తోందని, యుపి సహా అయిదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని తీర్మానం పేర్కొంది.
కాగా, ఒబిసి కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించేందుకు ఒక బిల్లును తీసుకువచ్చిన మోదీ ప్రభుత్వాన్ని మరో తీర్మానంలో బిజెపి ప్రశంసించింది. లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లును రాజ్యసభలో అడ్డుకొన్న ప్రతిపక్షాల తీరును సైతం ఆ తీర్మానం విమర్శించింది. లోక్‌సభ సభ్యుడు హుకుందేవ్ నారాయణ్ యాదవ్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పెట్రోలియం శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్‌లు సమర్థించారు.

చిత్రం..బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల తీర్మానం వివరాలను వెల్లడిస్తున్న ప్రకాశ్ జావడేకర్