జాతీయ వార్తలు

హోలీ వేడుకల్లో పాల్గొన్న సోనియా, రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియ గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు గురువారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో హోలీ వేడుకలు జరుపుకొన్నారు. చాలా ఏళ్ల తర్వాత సోనియా గాంధీ హోలీ వేడుకల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. సోనియా, ఆమె కుమారుడు 24, అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో దాదాపు పావు గంట సేపు గడిపారు. పార్టీ మహిళా కార్యకర్తలు ఇరువురు నేతలకు పూలు అందజేశారు. కొంతమంది వారికి గులాల్ పూశారు. ఏఐసిసి కోశాధికారి మోతీలాల్ వోరా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఢిల్లీ పిసిసి అధ్యక్షుడు అజయ్ మాకెన్, పార్టీ అధికార ప్రతినిధులు రణదీప్ సుర్జేవాలా, సందీప్ దీయిత్, మీమ్ అఫ్జల్‌తో పాటుగా పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ మెజారిటీ హిందువులతో పాటుగా అన్ని మతాల వారి గురించి పట్టించుకుంటున్నామనే సందేశాన్ని దేశవ్యాప్తంగా పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంది. ‘హోలీ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రంగుల పండుగ అయిన హోలీ దేశంలోని భిన్నత్వానికి ప్రతీక’ అని రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో హిందీలో అన్నారు. మీరు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన అవునని చెప్తూ, నా శుభాకాంక్షలు అందరికీనని అన్నారు.

చిత్రం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ