జాతీయ వార్తలు

ఆ నియామకాలు చెల్లవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20:గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నియమించిన నలుగురు సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కమిషనర్లుగా కొనసాగుతున్న వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఇంతియాజ్ అహ్మద్, ఎం విజయనిర్మల నియామకాలు చెల్లవని, వారు వెంటనే విధుల నుంచి తప్పుకోవాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2013లో ఎనిమిది మందిని సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా గవర్నర్‌కు సిఫార్సు చేసింది. వీరిలో మధుకర్ రాజు, ప్రభాకర్‌రెడ్డి, విజయ్‌బాబు, రతన్‌లను కమిషనర్లుగా గవర్నర్ ఆమోదించారు. మిగిలిన నలుగురి పేర్లను వెనక్కు తిప్పి పంపారు. తర్వాత ప్రభుత్వం ఈ నలుగురిని కూడా కమిషనర్లుగా నియమిస్తూ జీవో75 జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పద్మనాభయ్య, పద్మనాభరెడ్డి, రావు చెలికాని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన హైకోర్టు ఈ నియామకాలు చెల్లవంటూ తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ ఈ నలుగురూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఈ కేసు గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ కేహర్ నేతృత్వలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ నలుగురు కమిషనర్లు రాజకీయ పార్టీలతో ప్రత్యేక్ష సంబందం కలిగి ఉన్నారని, విజయ నిర్మల మినహా మిగతా ముగ్గురూ బార్ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్నందున అది సమాచార హక్కు చట్టానికి విరుద్ధమని వాదించారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. నలుగురు కమిషనర్ల తరపున న్యాయవాది గురుకృష్ణ కుమార్ వాదిస్తూ మరో పది నెలల్లో పదవీకాలం ముగుస్తున్నందువల్ల వారిని పదవుల్లో కొనసాగించాలని కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం ‘మీకు మీరు సర్ట్ఫికెట్ ఇచ్చుకుంటారా?’ అని ప్రశ్నించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ వెంటనే వారు పదవుల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.