జాతీయ వార్తలు

ఈడీ ఎదుట హాజరైన వీరభద్రసింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ప్రభుత్వ వాహనంపై ఎర్రబుగ్గ కనిపించకుండా కవర్ వేసి దాన్లోనే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసుకు వచ్చారు. హిమాచల్ సంప్రదాయ టోపీ ధరించిన 82 ఏళ్ల వీరభద్ర సింగ్ మీడియాతో ఒక్క మాట మాట్లాడలేదు. ‘సర్‌ప్రోషీ కి తమన్నా అబ్ హమారే దిల్ మెయిన్ హై’ అంటూ దేశభక్తిని ఆలపిస్తూ పిడికిలి చూపిస్తూ కదిలారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సింగ్, ఆయన కుటుంబ సభ్యులకు ఈడీ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి గత వారమే ఆయన ఈడీ ఎదుట హాజరుకావల్సి ఉండగా రాలేదు. దీంతో వ్యక్తిగతంగా హాజరుకావాలని గత మంగళవారం మరోసారి ఈడీ నోటీసులు పంపింది. కాగా తమ ఎదుట హాజరయ్యే సందర్భంగా అరెస్టు చేయబోమనే హామీని ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టుకు ఈడీ బుధవారం స్పష్టం చేసింది. తనపై దాఖలైన మనీలాండరింగ్ కేసును కొట్టివేయాలంటూ న్యాయమూర్తి ఆర్‌కె గౌబాను సింగ్ అభ్యర్థించారు. ఆయనతోపాటు పలువురు నిందితులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. కేంద్ర మంత్రిగా ఉండగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని సిఎంపై అభియోగం. ఈ కేసులో వీరభద్రసింగ్ భార్య ప్రతిభ, కుమారుడు విక్రమాదిత్యలు ఉండగా ఇద్దర్నీ ఇదివరకే ఈడీ ప్రశ్నించింది. 2009-2011 మధ్యకాలంలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా వీరభద్రసింగ్ పనిచేశారు.