జాతీయ వార్తలు

వదంతుల వ్యాప్తికి జైలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, ఏప్రిల్ 20: వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూప్‌లకు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి.. మీ గ్రూప్‌లో తప్పుడు వార్తలు పోస్ట్ చేసినా, వదంతులను ప్రచారం చేసినా ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోక తప్పదు. గ్రూప్‌లో ఏ సభ్యుడు తప్పు చేసినా, అందుకు సదరు సభ్యుడితోపాటు అడ్మినిస్ట్రేటర్ కూడా బాధ్యుడే అవుతాడు. ఫోటోలు, మనసుల్ని ఇబ్బంది పెట్టే వీడియోలు పోస్ట్ చేసినా నేరంగానే పరిగణిస్తారు. వారణాసి జిల్లా కలెక్టర్ యోగేశ్వర్ రామ్ మిశ్రా, ఎస్పీ నితిన్ తివారీలు ఈ మేరకు సంయుక్త ఉత్తర్వులు ఇచ్చారు. ‘వార్తా గ్రూప్‌ల పేరుతో సామాజిక మాధ్యమంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇందులో వచ్చే సమాచారం ధ్రువీకృతమైంది కాదు. ఎలాంటి ఆధారం లేకుండా, పరిశీలన చేయకుండా వార్తలు వస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది’ అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో దాదాపు 20 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. గ్రూప్‌లద్వారా వచ్చే తప్పుడు సమాచారానికి, నేరపూరిత సమాచారానికి బాధ్యత వహించటానికి అడ్మినిస్ట్రేటర్లు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. గ్రూప్‌లో ఎవరైన సభ్యుడు దొంగ వార్తల్ని పోస్ట్ చేసినా, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా పోస్ట్ చేసినా, వదంతులను ప్రచారం చేసినా.. అడ్మిన్ వెంటనే దాన్ని ఖండించాలని, అతణ్ణి గ్రూప్ నుంచి తొలగించాలని పేర్కొంది. అలాంటి సమాచారాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. అడ్మిన్ కనుక ఎలాంటి చర్య తీసుకోకపోతే, అతణ్ణి ఆ నేరానికి బాధ్యుణ్ణి చేయాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి వారణాసి జిల్లా యంత్రాంగం ఈ రకమైన కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. మత సామరస్యాన్ని దెబ్బ తీయటం, భావోద్వేగాలను రెచ్చగొట్టినా సదరు వ్యక్తిపై సైబర్ నేర చట్టాల ప్రకారం, ఐపిసిలోని ఐటి చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.