జాతీయ వార్తలు

దేశానికి ఇస్రో ఇతోధిక సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 21: దేశానికి అందిస్తున్న వివిధ సేవల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక పాత్ర పోషిస్తోందని ఆ సంస్థ చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్)లోని ఎంఆర్ కురుప్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన శాస్తవ్రేత్తలు, ఉద్యోగుల ప్రతిభా పురస్కార అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఇస్రో సెంటర్లలో పనిచేసే ప్రతి ఉద్యోగికి దేశానికి అందించే సేవల విభాగంతో ముడిపడి ఉంటుందన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేసి షార్ కేంద్రానికి మంచిపేరు తీసుకువాలన్నారు.
షార్‌లో పనిచేసే శాస్తవ్రేత్తలు, పరిపాలన విభాగంలో ఉత్తమ సేవలు అందించే ఉద్యోగులను గుర్తించి వారికి ప్రతిభా అవార్డులను అందించేందుకు ఇస్రో శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసి వారిని ప్రోత్సహించేందుకు అవార్డులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి ఏడాదికి 10మంది చొప్పున 30మందికి చైర్మన్ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం వారిని అభినందించి ఇదే స్ఫూర్తితో పనిచేసి మరిన్ని అవార్డులు అందుకోవాలని అభినందించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇస్రో చైర్మన్, షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్, కంట్రోలర్ జెవి.రాజారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

చిత్రం..షార్‌లో శాస్తవ్రేత్తలకు అవార్డులు ప్రదానం చేస్తున్న ఇస్రో చైర్మన్