జాతీయ వార్తలు

హోదా హామీ ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వటం లేదంటూ కాంగ్రెస్ సభ్యుడు జెడి శీలం ఎన్‌డిఏ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. శీలం శుక్రవారం రాజ్యసభలో కెవిపి రామచందర్‌రావు ప్రతిపాదించిన ఏపి విభజన చట్టం సవరణ బిల్లుపై మాట్లాడుతూ ఐదు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని వాదించిన బిజెపి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తున్నారని నిలదీశారు. హైదరాబాద్‌ను కోల్పోవటం వలన ఏపికి కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కేంద్రం ఏమీ చేయటం లేదని ఆయన ఆరోపించారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా అవసరం మేరకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పన్ను రాయితీలను ఇవ్వటంలో కూడా కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. రాజధాని నిర్మాణం, హైకోర్టు, రాజ్‌భవన్ తదితర భవనాల నిర్మాణానికి తగు విధంగా ఆర్థిక సహాయం చేయటం లేదని శీలం నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ త్వరగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఎంతో అవసరమని అయితే ఎన్‌డిఏ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్భ్రావృద్ధిని దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు. కొత్త రైల్వే జోన్ ఎందుకు ఇవ్వటం లేదని శీలం ప్రశ్నించారు.పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అప్పట్లో సభలో ఇచ్చిన హామీలను మరిచిపోయారని శీలం ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు. ఏపిని మోదీ, టిడిపి, వైసిపి ఎంపీలూ పట్టించుకోవటం లేదని శీలం ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి ఎందుకు అప్పగించటం లేదని ఆయన నిలదీశారు. దీనికి ఏపి ప్రభుత్వం జవాబుచెప్పాలని శీలం డిమాండ్ చేశారు.
జైరామ్ రమేష్‌తో శీలం వాగ్వాదం
రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తామనే హామీపై జెడి శీలం, మాజీ మంత్రి, కాంగ్రెస్ సభ్యుడు జైరామ్ రమేష్‌తో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. సభలోనే ఉన్న జైరామ్ రమేష్ స్పందిస్తూ ‘ఇలాంటి హామీ ఎప్పుడు ఇవ్వలేదు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామనే అభిప్రాయం కూడా కల్పించలేదు’అని వివరణ ఇచ్చారు. దీనికి శీలం బదులిస్తూ ‘మీరు విభజన బిల్లు తయారీ సమయంలో సీన్‌లోకి వచ్చాం. అంతకు ముందు జరిగింది మీకు తెలియదు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. యుపిఏ ప్రభుత్వాధినేతలతో మేం జరిపిన చర్చల గురించి మీకేమీ తెలియదు’ అంటూ నిప్పులు చెరిగారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకపోతేనే మంచిదంటూ శీలం ఆయనకు హితవు చెప్పారు.