జాతీయ వార్తలు

ఇదీ.. విజన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం రాష్టప్రతి భవన్‌లో జరుగుతున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పదిహేనేళ్ల విజన్ డాక్యుమెంట్‌పై చర్చించి కార్యచరణ రూపొందించనున్నారు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు నరేంద్ర మోదీతోపాటు రాష్ట్రాల సిఎంలు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పాణిగరియ, పాలకమండలి పూర్తిస్థాయి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యే సమావేశం నేడు, రేపు రెండురోజులు జరుగుతుంది. ఏపీ సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు సమావేశానికి హాజరవుతున్నారు. నీతి ఆయోగ్ కీలక భేటీకి హాజరవుతున్న తెలుగు సిఎంలు పనిలోపనిగా ప్రధాని నరేంద్ర మోదీని విడిగా కలిసి రాష్ట్రాల సమస్యలపై చర్చించనున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా అంచనాల ప్రకారం నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఖర్చును కేంద్రం భరించాలని చంద్రబాబు కోరనున్నారు. కేంద్రం మాత్రం 2014 నాటి ప్రాజెక్టు అంచనా ఖర్చును మాత్రమే భరిస్తుందని చెప్పటం తెలిసిందే. ఇదిలావుంటే చంద్రశేఖరరావు మాత్రం ముస్లింలకు తమ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లకు కేంద్రం ఆమోద ముద్ర వేయటం గురించి మాట్లాడే అవకాశాలున్నాయి. తమిళనాడు తరహాలో తమ రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపునకు అనుమతివ్వాలని కెసిఆర్ ప్రధానిని కోరే అవకాశముందని అంటున్నారు. గత రాత్రి ఢిల్లీకి చేరుకున్న కెసిఆర్, శనివారం తెరాస పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవరావు, లోక్‌సభలో పార్టీపక్షం నాయకుడు జతేందర్ రెడ్డి, లోక్‌సభ సభ్యుడు బి వినోద్‌కుమార్‌తో మంతనాలు సాగించారు. ఇదిలావుంటే, దేశం వివిధ రంగాల్లో సాధించాల్సిన అభివృద్ధిపై నీతిఆయోగ్ తయారు చేసిన పదిహేనేళ్ల విజన్ డాక్యుమెంట్‌పై పాలక మండలిలో లోతుగా చర్చ జరగనుంది. అరవింద్ పాణిగరియ నేతృత్వంలో నీతిఆయోగ్ తయారుచేసిన ఈ డాక్యుమెంట్‌లో ఏడేళ్ల వ్యూహపత్రం, మూడేళ్ల కార్యచరణ పథకాలు ఇమిడివున్నాయి. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయటంపై మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన రోడ్ మ్యాప్‌ను పాలకమండలి ముందుంచనున్నారు. జిఎస్టీపైనా పాలక మండలిలో ప్రత్యేక చర్చ జరగనుంది.