జాతీయ వార్తలు

గూండాగిరీని అణచివేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఏప్రిల్ 22: ఉత్తరప్రదేశ్‌లో గూండాగిరీని, దాదాగిరీని, దౌర్జన్యాలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని రాష్ట్ర కొత్త డిజిపి సుల్‌ఖాన్ సింగ్ స్పష్టం చేశారు. నేరం చేస్తే విఐపిలను కూడా వదలిపెట్టబోమని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగంతో నిష్పక్షపాతంగా పనిచేయించడానికే తాను తొలి ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం రాత్రి తొలిసారిగా చేసిన పోలీసు ఉన్నతాధికారుల బదిలీలలో సుల్‌ఖాన్ సింగ్‌కు పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) పదవి దక్కింది. డిజిపి పదవి నుంచి దిగిపోతున్న జావీద్ అహ్మద్ నుంచి శనివారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. సుల్‌ఖాన్ సింగ్ డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు భద్రత కల్పించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని పేర్కొన్నారు. ‘ఎవరు తప్పు చేసినా ఒకే రకమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. నేరస్థుడు ఎవరు, ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉంది అనే విషయాలతో నిమిత్తం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించడం జరుగుతుంది’ అని డిజిపి పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగంతో నిష్పక్షపాతంగా పనిచేయించడంతోపాటు పోలీసు బలగాల ఆత్మస్థయిర్యాన్ని పెంపొందించడానికి తాను తొలి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. పోలీసు యంత్రాంగంలో అవినీతి పెచ్చుమీరిందని వస్తున్న ఆరోపణలపై ప్రశ్నించగా, ‘అన్ని కేసుల్లోనూ నిష్పక్షపాతమైన విచారణ జరుగుతుంది’ అని ఆయన బదులిచ్చారు. పోలీసు వ్యవస్థ పనితీరును మానవత్వం, మర్యాద గల దానిగా తీర్చిదిద్దడానికి తాను అధిక ప్రాధాన్యం ఇస్తానని డిజిపి పేర్కొన్నారు.
కొత్తగా 40 యోగా ఆరోగ్య కేంద్రాలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్న యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్టవ్య్రాప్తంగా 40 యోగా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వాటిలో 23 ఆయుర్వేదిక్, 7 యునాని, 12 హోమియో ఆసుపత్రులు ఉంటాయని సంబంధిత అధికారి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న లక్నోలో నిర్వహించినున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సిఎం ఆదేశించారు. 51వేల మంది యోగా సాధకులు పాల్గొననున్న ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వారణాసిలోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్, ఆసుపత్రిలో మహిళా హాస్టల్‌తోపాటు కొత్త ఆసుపత్రికి, పాలనా విభాగానికి వేర్వేరుగా భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆ అధికారి తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలకు సైతం విస్తృత వైద్య సేలు అందాలని ముఖ్యమంత్రి సూచించారని ఆయన తెలిపారు.

చిత్రం..ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న కొత్త డిజిపి సుల్‌ఖాన్ సింగ్