జాతీయ వార్తలు

ప్రకృతి పరిరక్షణపై చైతన్యం పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ప్రకృతిని, ప్రకృతి వనరులను పరిరక్షించుకోవాలన్న చైతన్యం ప్రజల్లో పెరుగుతుందన్న ఆశాభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ధరిత్రి దినాన్ని పురస్కరించుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘్ధరిత్రి దినం అంటే భూమాతకు కృతజ్ఞతలు తెలుపుకునే దినం. మన భూగ్రహాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచుతామనే మన దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించే రోజు’ అని ప్రధాని శనివారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. ‘మొక్కలు, చెట్లు, జంతువులు, పక్షులతో కలిసి సామరస్యంగా జీవించడం మన విధి. దీనిని మన భావి తరాలకు అందించవలసి ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇతివృత్తమైన ‘పర్యావరణం, వాతావరణ జ్ఞానం’ గురించి ఆయన ప్రస్తావిస్తూ, ప్రకృతి, ప్రకృతి వనరులను పరిరక్షించడానికి ఇది దోహదపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

చిత్రం..ధరిత్రి దినాన్ని పురస్కరించుకొని శనివారం యూపీలోని మీర్జాపూర్‌లో
భూమాతను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్న చిన్నారులు