జాతీయ వార్తలు

మాజీ సైనికుడి ఇంట్లో 100 కిలోల మనుబోతు మాంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మాంసం వాసన.. ఏ మేకదో, గొర్రెదో కాదు.. మనుబోతు(నీల్‌గాయ్) మాంసం.. అదీ ఒకటి రెండు కిలోలు కాదు.. ఏకంగా 117 కిలోల మాంసం.. ఓ మాజీ సైనికాధికారి ఇంటిపై దాడి చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు నివ్వెర పోయేంత మాంసం దొరికింది. అంతే కాదు.. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా పులుల చర్మాలు, ఇతర జంతు చర్మాలు, జింక, సాంబా ర్, నల్లదున్న ఇలా అనేక జంతువుల పుర్రెలు, 40 తుపాకులు భారీ ఎత్తున లభించాయి. శనివారం నుంచి ఆదివారం దాకా దాదాపు 17గంటల పాటు డి ఆర్ ఐ అధికారులతో పాటు, అటవీశాఖ అధికారులు సదరు రిటైర్డ్ కల్నల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ అధికారి కొడుకు ప్రశాంత్ జాతీయ షూటర్. మనుబోతు మాంసాన్ని ఒక రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ సిండికేట్‌తో కలిసి ప్రశాంత్ భారీగా జంతు చర్మాలు, వన్యప్రాణుల మాంసం, పుర్రెలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సిండికేట్‌లోని ఓ సభ్యుడు కార్బెట్ నేషనల్ పార్క్ సమీపంలో ఒక చిరుతను చంపినట్లు అధఙకారులు చెప్పారు. తమ సోదాల్లో లెక్కల్లోకి రాని కోటి రూపాయల నగదు, రెండు లక్షల బుల్లెట్ క్యాటరిడ్జ్‌లు లభించినట్లు పేర్కొన్నారు. అక్రమాయుధాలు సరఫరా చేసే ఒక ముఠాకు చెందిన స్లోవేనియన్ జాతీయుడితో పాటు ముగ్గురు అనుమానితులను శనివారం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేయటంతో ఈ స్కాం అంతా వెలుగులోకి వచ్చింది. వీరు టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో 25ప్రాణాంతక ఆయుధాలు తీసుకుని వచ్చి పట్టుపడ్డారు. వారిచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆయుధాలు ఇటలీ, ఆస్ట్రియా, జర్మనీలలో తయారైనవని పేర్కొన్నారు.

చిత్రాలు..మీరట్‌లో ఆదివారం నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో రిటైర్డ్ కల్నల్ దేవేంద్ర కుమార్ నుంచి స్వాధీనం చేసుకున్న జంతువుల చర్మాలు, కొమ్ములు, దంతాలు, జంతు మాసం