జాతీయ వార్తలు

అవినీతి పెచ్చరిల్లింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిని అరికట్టడంలో, నల్లధనాన్ని నిరోధించటంలో దారుణంగా విఫలమయ్యారని సిపిఎం పార్టీ మంగళవారం ఆరోపించింది. గత ఆరు నెలల్లో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు కూడా చాలా పెరిగాయని విమర్శించింది. నవంబర్ ఎనిమిదిన పెద్దనోట్ల రద్దును ప్రకటిస్తూ అవినీతిపై పోరాటానికి, నల్లధనాన్ని నిర్మూలించటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని ప్రకటించారని, ఉగ్రవాదానికి వరదలా పారుతున్న నిధులు నిలిచిపోతాయని పేర్కొన్నారని, కానీ గత ఆరు నెలల్లో ఈ మూడు కూడా దేశంలో విపరీతంగా పెరిగిపోయాయని సీపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ‘ఆరు నెలలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ ఎంతమేరకు పాతనోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయో ఎలాంటి లెక్క లేదు’ అని ఆయన అన్నారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన పెద్దచేపలను కేంద్రం తేలిగ్గా వదిలివేసిందని, మొండిబకాయిలను సృష్టిస్తోందన్నారు. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న హామీ కూడా గాల్లో కలిసిపోయిందని, ప్రభుత్వ చర్యవల్ల ఉద్యోగావకాశాలు తగ్గుతున్నాయే తప్ప పెరగటం లేదని ఏచూరి వ్యాఖ్యానించారు.
14న ఏపీ భవన్ ఉద్యోగుల
సంఘం రజతోత్సవ వేడుకలు

న్యూఢిల్లీ, మే 9: దేశ రాజధానిలోని ఏపీ భవన్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పడి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 14న రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల వివరాల ఏపీ భవన్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకుడు అనందరావు వివరించారు. రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే హాజరుకానున్నట్టు ఆయన చెప్పారు.
సుప్రీంకోర్టు మంచి పనే చేసింది
కర్ణన్ ఆ శిక్షకు అర్హుడే న్యాయ నిపుణుల ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ, మే 9: కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు సుప్రీంకోర్టు అరునెలల జైలుశిక్ష విధించిన తర్వాత కోల్‌కతా హైకోర్టుకు చెందిన వివాదాస్పద న్యాయమూర్తి సిఎస్ కర్ణన్‌కు న్యాయ కోవిదులనుంచే కాకుండా ఆ వర్గానికి చెందిన ఎవరినుంచి కూడా ఎలాంటి సానుభూతి లభించలేదు. దేశవ్యాప్తంగా న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి తప్పుచేసిన కర్ణన్ ఈ శిక్షకు అర్హుడేనని న్యాయ కోవిదులు సైతం అంటుండడం గమనార్హం. అంతేకాదు ఒక హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తికి శిక్ష విధించి సుప్రీంకోర్టు సాహసోపేత చర్య తీసుకుందని, ఇది సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇస్తుందని కూడా నిపుణులు అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై పిటిఐ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి విఎన్ ఖరే అభిప్రాయాన్ని కోరగా, కర్ణన్ ప్రవర్తనకు ఈ శిక్ష తగినదేనని ఖరే వ్యాఖ్యానించారు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎన్ ధింగ్రా సైతం ఇదే విధంగా అభిప్రాయపడ్డారు. ‘జస్టిస్ కర్ణన్ సుప్రీంకోర్టుకు మరే ప్రత్యామ్నాయాన్ని వదిలిపెట్టలేదు. సర్వోన్నత న్యాయస్థానం సరయిన పనే చేసింది. ఇది సమాజానికి సరయిన సందేశాన్ని పంపిస్తుంది’ అని ఆయన అన్నారు. మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ సైతం వీరి వ్యాఖ్యలతో ఏకీభవించడమే కాకుండా కర్ణన్ దళిత కార్డును ఉపయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జస్టిస్ కర్ణన్ ఆ శిక్షకు అర్హుడే. చివరికి మద్రాసు హైకోర్టు జడ్జిలు సైతం ఆయన ప్రవర్తన సరికాదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర జడ్జీలకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చే అధికారం ఆయనకు లేదు’ అని జస్టిస్ విఎన్ ఖరే అన్నారు.

ఆదాయంలో 60శాతమే ఖర్చు చేసిన పార్టీలు
100కోట్ల ఆదాయం దాటేసిన సిపిఎం ఆడిట్ నివేదిక ఇవ్వని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు
న్యూఢిల్లీ, మే 9: దేశవ్యాప్తంగా అయిదు పార్టీలు 2015-16 సంవత్సరానికి సంబంధించి తమకు వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయంలో 60శాతం ఖర్చు చేశాయి. బిఎస్‌పి, ఎన్‌సిపి, సిపిఎం, సిపిఐలు మాత్రమే తమ ఆడిట్ నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి దఖలు పరిచాయి. అతి పెద్ద జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లు గడువు తీరిపోయి ఆరు నెలలు గడిచినా తమ నివేదికలను సమర్పించలేదని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ‘వాస్తవానికి 2016 అక్టోబర్ 31కల్లా అన్ని పార్టీలూ తమ ఆడిట్ నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంది. కానీ తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం, బిఎస్‌పిలు మాత్రమే తమ నివేదికలను సమర్పించాయి. అడిట్ నివేదికలు ఇచ్చిన పార్టీల్లో బిఎస్పీ రూ.47.38 కోట్లు ఆదాయం రాగా ఖర్చు చేసింది కేవలం రూ.11.90కోట్లు (25శాతం) ఖర్చు చేసింది. తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.34.57కోట్లు ఆదాయం రాగా 13.35కోట్లు ఖర్చు చేసింది. ఎన్సీపీ తనకు వచ్చిన ఆదాయం కంటే 19శాతం ఎక్కువ ఖర్చు చేసింది. 2015-16లో ఎన్సీపీకి వచ్చిన ఆదాయం 9.14కోట్లు కాగా ఖర్చు చేసింది 10.84 కోట్లు. సిపిఎం తన ఆదాయాన్ని 107.48కోట్లుగా చూపించింది. నివేదికలు ఇచ్చిన పార్టీల్లో అత్యధిక ఆదాయం ఈ పార్టీదే.

భారత్‌లో ఆగని నల్లధన ప్రవాహం
ఐక్యరాజ్య సమితి నివేదిక
న్యూఢిల్లీ, మే 9: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు ఒక్కటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త కరెన్సీ నోట్లలోకి నల్లధన ప్రవాహాన్ని అడ్డుకోజాలదని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి అభిప్రాయపడింది. అప్రకటిత సంపద, ఆస్తులను వెలికి తీయడానికి దీనికి తోడుగా అనుబంధ చర్యలను కూడా ఉపయోగించుకోవాలని ఐక్యరాజ్య సమితి ‘ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఏసియా అండ్ పసిఫిక్ 2017’ పేరిట విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన ఆరు నెలలకు ఈ నివేదిక విడుదల కావడం గమనార్హం.

లాడెన్ నుంచి షరీఫ్‌కు ముడుపులు
ఇమ్రాన్‌ఖాన్ ఆరోపణలు
ఇస్లామాబాద్, మే 9: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించడానికి బిన్‌లాడెన్ నుంచి డబ్బులు తీసుకున్నారని ప్రతిపక్ష పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ తీవ్ర ఆరోపణ చేశారు. కాశ్మీర్‌లో జీహాదీని ప్రోత్సహించడానికి షరీఫ్ ప్రయత్నించారని తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ఇమ్రాన్‌ఖాన్ ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆఫ్గనిస్తాన్, కాశ్మీర్‌లో జిహాదీని ప్రోత్సహించడానికి అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్ నుంచి 1.5 బిలియన్లు తీసుకున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపచడానికి షరీఫ్ కుట్రలు పన్నారని, వాటన్నింటికీ ఆ నిధులనే వెచ్చించినట్టు పిఐటి అధికార ప్రతినిధి, ఇంటిలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ జనరల్ మసూద్ షరీఫ్‌ఖాన్ ఖట్టక్ వెల్లడించారు. ఈ మేరకు సుప్రీం కోర్టుకు ఆయనొక నివేదిక అందజేశారు. బేనజీర్ భుట్టోను గద్దెదించడానికి 270 మిలియన్లు షరీఫ్ ఖర్చుచేయించారని, ఇదంతా లాడెన్ నుంచి వచ్చిన సొమ్మేనని అన్నారు.