జాతీయ వార్తలు

సైన్యంపై విశ్వాసం ఉంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, మే 9: ఉగ్రవాదులపై సర్జికల్ దాడులు జరపడం ద్వారా తమ సామర్థ్యాన్ని చాటిన సాయుధ దళాలపై ఈ దేశ ప్రజలు విశ్వాసం ఉంచాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇటీవల అధీన రేఖ వద్ద ఇద్దరు భారత జవాన్లను దారుణంగా నరికి చంపిన నేపథ్యంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోను ఈ దేశ గౌరవప్రతిష్టలకు భంగం రానివ్వమని అన్నారు. ‘సైన్యంపై ఈ దేశ ప్రజలు విశ్వాసం ఉంచాలి. ఉరి ఉగ్రవాద దాడి తర్వాత భారత జవాన్లు పాకిస్తాన్ భూభాగంపై ఉగ్రవాదుకు వ్యతిరేకంగా ఆపరేషన్‌ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా అవసరమైతే భారత సైనికులు ఉగ్రవాదులను వారి గడ్డపైనే దెబ్బతీయగలరనే విషయాన్ని చాటి చెప్పారు’ అని రాజ్‌నాథ్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ దేశ గౌరవానికి హాని కలగనివ్వమని ఆయన చెప్పారు. ‘ఉగ్రవాదుల భూభాగంలోకి ప్రవేశించాక వారి స్థావరాలను ధ్వంసం చేశాం. మన జవాన్లను, సైన్యాన్ని చూసి గర్విస్తున్నాం. వారిపట్ల మాకు ఎనలేని విశ్వాసం ఉంది’ మంగళవారం రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో మేవార్ రాజు రాణా ప్రతాప్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ రాజ్‌నాథ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఒక బలమైన దేశంగా తయారైందన్నారు. మహారాణా ప్రతాప్‌కు చరిత్రలో దక్కాల్సిన స్థానం దక్కలేదని రాజ్‌నాథ్ అంటూ, ఆయన చేసిన సేవలపై తిరిగి పరిశోధనలు జరపాలని చరిత్రకారులను కోరారు. చరిత్రకారులు అక్బర్‌ను గొప్పవాడిగా పొగిడారే తప్ప రాణా ప్రతాప్‌ను పొగడకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. అక్బర్‌ను గొప్పవాడిగా పేర్కొనడంపై తనకెలాంటి అభ్యంతరం లేదని, అయితే దేశ చరిత్రలో రాణా ప్రతాప్ గురించి సరయిన అంచనా వేయాలని చరిత్రకారులను కోరుతున్నానని రాజ్‌నాథ్ అన్నారు.