జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో అదుపులోకొచ్చిన కార్చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: ఉత్తరాఖండ్ అడవిని దగ్ధం చేస్తున్న దావానలం అదుపులోకి వచ్చిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. ఈ దావానలం కారణంగా ప్రాణనష్టం ఏదీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో భయపడాల్సింది ఏమీ లేదని.. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం మంటల్ని అదుపులోకి తీసుకురావటంలో సమర్థంగా పనిచేస్తోందని రాజ్‌నాథ్ అన్నారు. తాను కూడా పరిస్థితిని సమీక్షించినట్లు వెల్లడించారు. జీరో అవర్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగతారాయ్, బీజేపీ నేత జగదంబికా పాల్ మరికొందరు అడిగిన ప్రశ్నకు రాజ్‌నాథ్ జవాబిచ్చారు. దావానలం వార్త తెలిసిన వెంటనే తమ మంత్రిత్వశాఖకు చెందిన ఒక బృందం ఉత్తరాఖండ్‌కు వెళ్లిందని.. జాతీయ విపత్తు స్పందన బలగం హెలికాప్టర్ల సాయంతో రంగంలోకి దిగిందని మంత్రి వెల్లడించారు. దాదాపు 89రోజుల క్రితం ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు ప్రారంభమయ్యాయని.. సుమారు 3వేల ఎకరాలు కాలి బూడిదయిందని ఆయన స్పష్టం చేశారు.