జాతీయ వార్తలు

విజయ్ మాల్యా దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: కోర్టు ధిక్కార కేసులో వ్యాపారవేత్త విజయ్ మాల్యాను సుప్రీం కోర్టు మంగళవారం దోషిగా ఖరారు చేసింది. కోర్టు ఆర్డర్‌కు వ్యతిరేకంగా 40మిలియన్ డాలర్లను తన పిల్లల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. బ్రిటిష్ కంపెనీ డియాగియోనుంచి మాల్యాకు డబ్బు ముట్టిందని కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టుకు విన్నవించింది. జస్టిస్ ఏకె గోయల్, జస్టిస్ యుయు లలిత్‌లతో కూడిన ధర్మాసనం మాల్యాను రెండు అంశాలలో కోర్టు ధిక్కారం కింద దోషిగా నిర్ణయిస్తున్నట్లు పేర్కొంది. కింగ్‌ఫిషర్ టైకూన్ అయిన మాల్యా 17బ్యాంకుల నుంచి రూ9వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని వాటిని చెల్లించకుండా 2016మార్చిలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయనపై సిబి ఐ కోర్టు మనీలాండరింగ్ అభియోగాలు మోపింది. గత జనవరి 31న మాల్యాపై సిబి ఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ కూడా జారీ చేసింది. మాల్యాను అప్పగించాల్సిందిగా ఫిబ్రవరి 9న విదేశాంగ మంత్రిత్వ శాఖ యుకెను కోరింది. ఏప్రిల్ 18న స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేసినప్పటికీ కొద్ది గంటల్లోనే ఆయనకు బెయిల్ లభించింది. మాల్యాను భారత్‌కు అప్పగిస్తే ఆయనకు జైలుశిక్ష, జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి.