జాతీయ వార్తలు

కేజ్రీవాల్ రాజీనామాకు దీక్ష చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 9: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై వచ్చిన అవినీతి కథనాలపై సామాజిక కార్యకర్త అన్నాహజారే తీవ్రంగానే స్పందించారు. కేజ్రీవాల్ అవినీతికి పాల్పడినట్టు రుజువైతే సిఎం పదవికి రాజీనామా చేయాల్సిందిగా తాను స్వయంగా జంతర్‌మంతర్ వద్ద దీక్షకు దిగుతానని మంగళవారం ప్రకటించారు. ‘కేజ్రీవాల్ అవినీతికి పాల్పడినట్టు రుజువైతే ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఒకవేళ కేజ్రీ వైదొలగకపోతే నేనే జంతర్‌మంతర్ వద్ద దీక్షకు కూర్చుంటాను’ అని మహారాష్టల్రోని సొంతూరు రాలేగావ్ సిద్ధిలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కేజ్రీవాల్‌పై అవినీతి వార్తలు తనను ఎంతో బాధించాయని తొలుత హజారే వ్యాఖ్యానించారు. కాగా మాజీ మంత్రి కపిల్ మిశ్రా ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలపై హజారే పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాతే మిశ్రా ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. కేజ్రీవాల్ ముడుపులు తీసుకుని ఉంటే ఇంతకాలం ఎందుకు బయటపెట్టలేదని హజారే నిలదీశారు. అప్పుడే బయటపెట్టి ఉండవచ్చుకదా? అని ఆయన తెలిపారు. ఏదిఏమైనా కేజ్రీవాల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువైతే మాత్రం జంతర్‌మంతర్ వద్ద మళ్లీ దీక్ష చేస్తానని హజారే వెల్లడించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ క్రీయాశీలక పాత్ర పోషించారు. ఆప్ మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రెండు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. అయితే మిశ్రా ఆరోపణలకు డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా తోసిపుచ్చారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదన్న కారణంతో కపిల్ మిశ్రాను శనివారం రాత్రి కేబినెట్ నుంచి తప్పించారు. మొత్తానికి కేజ్రీవాల్ ముడుపుల వ్యవహారం ఆప్‌లో అంతర్యుద్ధానికి దారితీసింది. దీంతో మిశ్రాను ఏకంగా ఆప్ ప్రాథమిక సభ్యత్వం నుంచే సస్పెండ్ చేశారు. ఇలా ఉండగా కపిల్ మిశ్రా మంగళవారం సిబిఐని కలిసి కేజ్రీవాల్, మంత్రి సత్యేందర్ జైన్, ఆప్ నాయకులపై ఫిర్యాదు చేశారు. విదేశాల నుంచి వచ్చిన పార్టీ ఫండ్‌ను దుర్వినియోగం చేశారని మిశ్రా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా బుధవారం నుంచి దీక్ష చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు.