జాతీయ వార్తలు

జాదవ్ ప్రాణాలకు ముప్పుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్, మే 10: పాకిస్తాన్‌లో భారత పౌరుడు కులభూషణ్ జాదవ్ ప్రాణాలకు ముప్పు ఉండడం, అలాగే దాదాపు 16 సార్లు కోరినప్పటికీ తమ కాన్సులేట్ అధికారులు అతడ్ని కలుసుకోవడానికి నిరాకరించిన కారణంగానే ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కాగా, జాదవ్‌కు ఉరిశిక్ష అమలును నిలిపి వేస్తూ హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచ్చిన ఆదేశాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని, త్వరలోనే దీనిపై పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తుందని విదేశీ వ్యవహారాలపై పాక్ ప్రధానికి సలహాదారయిన సర్తార్ అజీజ్ బుధవారం ఇస్లామాబాద్‌లో చెప్పారు. ‘ఒక పౌరుడి అక్రమ నిర్బంధం కారణంగానే భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే నిర్ణయం తీసుకుంది. కిడ్నాప్‌కు గురయిన, పాకిస్తాన్‌లో అక్రమ నిర్బంధంలో ఉన్న ఓ భారత పౌరుడి ప్రాణాలకు ముప్పు ఉండే పరిస్థితి అది’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు. జాదవ్‌కు సైనిక న్యాయస్థానం మరణశిక్ష విధించిన తర్వాత అతని తల్లి తమ కుమారుడిని కలిసే అవకాశం కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయానికి ఒక లేఖ రాసింది. అయితే జాదవ్ తల్లి పిటిషన్ ఏ స్థితిలో ఉందో తమకు తెలియదని కూడా బాగ్లే చెప్పారు. తమ కుమారుడిని కలుసుకోవడానికి జాదవ్ తల్లిదండ్రులకు వీసా ఏర్పాటు చేయాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా పాకిస్తాన్ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారయిన సర్తార్ అజీజ్‌కు లేఖ రాసినప్పటికీ జాదవ్ తల్లి పిటిషన్ ఏ స్థితిలో ఉందో తెలియకపోవడం గమనార్హం. జాదవ్ నిర్బంధం, విచారణ విషయంలో కాన్సులర్ రిలేషన్స్‌కు సంబంధించి వియన్నా అంతర్జాతీయ ఒడంబడికలోని నిబంధనలను పాక్ ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపిస్తూ భారత్ చేసిన ఫిర్యాదుపై అంతర్జాతీయ న్యాయస్థానం చర్యలు ప్రారంభించి జాదవ్ ఉరిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పాక్ విదేశాంగ శాఖ త్వరలోనే ఒక ప్రకటన చేస్తుందని విదేశీ వ్యవహారాలపై పాక్ ప్రధానికి సలహాదారయిన సర్తార్ అజీజ్ బుధవారం తెలియజేశారు. తమ దేశంలో భారతదేశం పాల్పడుతున్న ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికే ఆ దేశం జాదవ్ మరణశిక్ష ఘటనను ఉపయోగించుకుంటోందని పాక్ రక్షణ మంత్రి ఖావాజా ముహమ్మద్ ఆసిఫ్ ఆరోపించారు. పాక్ మీడియా సైతం జాదవ్ విషయంలో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది.