జాతీయ వార్తలు

ఫిరాయింపులపై చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: రాజ్యాంగాన్ని కాపాడేందుకు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమర్థంగా అమలు జరిగేలా చూడాలని, లక్షలాది మంది డిపాజిటర్లను మోసం చేసిన ఆగ్రిగోల్డ్ వ్యవహారంపై న్యాయస్థానం పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఏపి విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం హుటాహుటిన ఢిల్లీకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి మోదీని ఆయన అధికార నివాసంలో కలిసి మూడు అంశాలపై తమ వాదన వినిపించారు. జగన్‌మోహన్‌రెడ్డి వెంట పార్టీ సీనియర్ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డితోపాటు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి వచ్చారు. జగన్‌మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులు, ఆగ్రిగోల్డ్, ప్రత్యేక హోదా అంశాలపై ఆరుపేజీల వినతి పత్రాన్ని మోదీకి అంద జేశారు.
అవినీతిమయమైపోయిన తెలుగుదేశం ప్రభుత్వం అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇతరపార్టీల శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకుంటోందని, తమ పార్టీకి చెందిన 20 మంది శాసన సభ్యులను తమ పార్టీలో చేర్చుకోవటంతోపాటు వీరిలో నలుగురిని మంత్రివర్గంలో చేర్చుకున్నారని ఆయన ప్రధానికి వివరించారు. అసెంబ్లీలో ఈ శాసన సభ్యులు ఈరోజుకు కూడా వైఎస్‌ఆర్‌సిపి సభ్యులుగానే కొనసాగుతున్నారన్నారు. పార్టీ ఫిరాయించిన ఈ ఇరవై మందిని అనర్హులుగా ప్రకటించాలని తమ పార్టీ సంవత్సరం క్రితం స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. టిడిపి ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టులు, విద్యుత్, బొగ్గు కొనుగోలులో తీవ్రమైన అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు.
ఆగ్రిగోల్డ్‌లో పెట్టుబడి పెట్టిన 32లక్షల మంది ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కుంభకోణంపై న్యాయస్థానం పర్యవేక్షణలో సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని జగన్‌మోహన్‌రెడ్డి మోదీని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కుంభకోణంపై ఇంతవరకు సరైన దర్యాప్తు జరిపించలేదని ఆయన ఆరోపించారు. ఆగ్రిగోల్డ్‌కు సంబంధించిన అన్ని ఆస్తులు వేలం వేయాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోలేదన్నారు. ఆగ్రిగోల్డ్ ఆస్తులను కొందరు రాష్టమ్రంత్రులు, ఎంపిలు బెనామీ పేర్లతో కొనుగోలు చేశారని ఆయన ప్రధానికి ఫిర్యాదు చేశారు.
కేంద్రం మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రకటించిన ప్రత్యేక చర్యలను జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతించారు. కేంద్రం ప్రకటించిన ఐదువేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో మూడు వేల రుపాయలు ప్రకటిస్తే బాగుండేదని జగన్ అభిప్రాయపడ్డారు. మిర్చి రైతులకు ఎనిమిది వేల రూపాయల కనీస మద్దతు ధరతో పాటు రవాణా తదితర ఖర్చులకు అదనంగా 1250రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదని జగన్ తన వినతి పత్రంలో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోందన్నారు. మొత్తం ఐటి రంగం హైదరాబాదులో ఉండిపోవటంతో ఏపిలో ఉపాధి కల్పన కష్టంగా మారిందన్నారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చామని దేశం నేతలు చెప్పటం ఆంధ్రప్రజలను మోసం చేయటమేనని జగన్ స్పష్టం చేశారు.