జాతీయ వార్తలు

రాష్టప్రతి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ మల్లగుల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: రాష్టప్రతి పదవికి ఎవరిని రంగంలోకి దించాలనే అంశంపై కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్టప్రతి పదవికి ఎంపిక చేసే వ్యక్తిని ఎలా ఎదుర్కోనాలనేది ప్రతిపక్షానికి అంతుపట్టకపోవటంతో అభ్యర్థి ఎంపిక మరింత జటిలంగా మారింది. ప్రతిపక్షం ఇప్పుడు తాజాగా జాతిపిత మహాత్మాగాంధీ మనువడు గోపాలకృష్ణ గాంధీ, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రాష్టప్రతి పదవికి ప్రతిపక్షం అభ్యర్థిగా జెడియు సీనియర్ నాయకుడు శరద్ యాదవ్‌ను రంగంలోకి దించాలని మొదట భావించారు. అయితే శరద్ యాదవ్ అభ్యర్థిత్వం పట్ల జెడి(యు)లోనే వ్యతిరేకత వ్యక్తమైంది. దీనితో ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి నరేంద్ర మోదీ అంగీకరిస్తే కొత్త రాష్టప్రతి ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవచ్చునని అధికార పక్షానికి ప్రతిపక్షం అనధికారికంగా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన పట్ల అధికార పక్షం నుండి ఎలాంటి స్పందనా రాలేదు. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తాము ప్రతిపక్షానికి చెందిన ప్రణబ్ ముఖర్జీని రెండోసారి రాష్టప్రతిగా ఎలా ఎన్నుకుంటామని బిజెపి ప్రశ్నించింది. నరేంద్ర మోదీ ప్రతిపాదించే వ్యక్తినే రాష్టప్రతి భవన్‌కు పంపిస్తామని వారు స్పష్టం చేశారు. దీనితో ప్రతిపక్షం మరోసారి తమ అభ్యర్థి వేటలో పడింది. రాజ్యసభ ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీ పేరును కూడా ప్రతిపక్షం పరిశీలించింది. అయితే ఆయన అభ్యర్థిత్వం పట్ల ప్రతిపక్షంలోనే ఏకాభిప్రాయం కుదరలేదని అంటున్నారు. హమీద్ అన్సారీని ప్రతిపక్షం అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణం ప్రతిపక్షానికి చెందిన సగం పార్టీలు అధికార పక్షం అభ్యర్థికి మద్దతు ఇచ్చే ప్రమాదం నెలకొన్నదని అంటున్నారు. అందుకే ప్రతిపక్షం ఇప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ మనుమడు, దౌత్యవేత్త గోపాలకృష్ణ గాంధీని రాష్టప్రతి ఎన్నికలో ప్రతిపక్షం అభ్యర్థిగా రంగంలోకి దించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ప్రతిపక్షానికి చెందిన ముగ్గురు సీనియర్ నాయకులు ఇటీవల గోపాలకృష్ణ గాంధీని కలిసి రాష్టప్రతి పదవికి తమ అభ్యర్థిగా పోటీ చేయటం గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. గోపాలకృష్ణ గాంధీ అభ్యర్థిత్వం పట్ల ప్రతిపక్షంలోని మెజార్టీ పార్టీలు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. గోపాలకృష్ణ గాంధీతోపాటు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పేరు కూడా ప్రతిపక్షం పరిశీలనలో ఉన్నదని అంటున్నారు. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడైన బాబు జగ్జీవన్ రాం కూతురైన మీరాకుమార్ అభ్యర్థిత్వం పట్ల ప్రతిపక్షానికి చెందిన రెండు, మూడు పార్టీలు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. మీరాకుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కాబట్టి కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తికి తాము మద్దతు ఇవ్వటం సాధ్యం కాదని ప్రతిపక్షానికి చెందిన ఒక పార్టీ స్పష్టం చేసిందని అంటున్నారు. దీనితో గోపాలకృష్ణ గాంధీ పేరు మాత్రమే ప్రస్తుతం ప్రతిపక్షం పరిశీలనలో ఉన్నదని చెబుతున్నారు. రాష్టప్రతి ఎన్నికలో ప్రతిపక్షం తరపున ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాలనే గట్టి పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒక తాటి మీదికి తెచ్చేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. సోనియా గాంధీ వచ్చే వారం ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ప్రత్యేకంగా సమావేశం జరుపనున్నారు. సోనియా గాంధీ ప్రత్యేక ఆహ్వానం మేరకు వచ్చే వారం ఢిల్లీకి వస్తున్న మమతా బెనర్జీ కూడా ప్రతిపక్షం తరపున ఒక సమర్థుడైన నాయకుడిని రంగంలోకి దించాలనే పట్టుదలతో ఉన్నది. అందుకే ఆమె కొంత కాలం క్రితం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినాయకుడు నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరపటం తెలిసిందే.