జాతీయ వార్తలు

ఉజ్జయిని కుంభమేళాలో గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉజ్జయిని, మే 6: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరుగుతున్న కుంభమేళా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వడగళ్లతో కురిసిన భారీ వర్షానికి కుంభమేళా ప్రాంతంలో యాత్రికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న టెంట్లు కుప్ప కూలడం, పిడుగులు పడ్డంతో కనీసం ఏడుగురు చనిపోగా, 90 మందికి పైగా గాయపడ్డారు. మేళా ప్రాంతంలో, చుట్టుపక్కల ఏడుగురు చనిపోగా, మరో 90 మంది గాయపడినట్లు ఉజ్జయిని డివిజనల్ కమిషనర్ రవీంద్ర పస్తౌర్ చెప్పారు. ఈ నెల 9న రెండో ‘షాహీ స్నాన్’ జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు కుంభమేళాకు తరలి వస్తున్నారు. చనిపోయిన వారిలో ఉందాసా ప్రాంతంలో పిడుగుపడి మృతి చెందిన మహిళ కూడా ఉన్నారు. సుడిగాలి తీవ్రతకు యాత్రికులు ఏర్పాటు చేసుకున్న టెంట్లలో మూడో వంతు కూలిపోయాయని, వాటిని తిరిగి ఏర్పాటు చేయడానికి కనీసం వారం పడుతుందని పోలీసు అధికారి బిఎస్ చౌహాన్ చెప్పారు. సహాయక సిబ్బంది కూలిపోయిన టెంట్లను తొలగించడంతో పాటుగా వాటి కిందినుంచి జనాన్ని ఇంకా వెలికి తీస్తున్నందున మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు భయపడుతున్నారు. కాగా, ఈ సంఘటన బాధాకరమని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభివర్ణిస్తూ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 50 వేలు, స్వల్పగాయాలయిన వారికి పాతిక వేల చొప్పున పరిహారం ప్రకటించారు. పరిస్థితిని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి శుక్రవారం ఉజ్జయిని సందర్శిస్తారని అధికారులు చెప్పారు.