జాతీయ వార్తలు

బెంగాల్ తుది విడత ఎన్నికల్లో 84 శాతానికి పైగా పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 5: పశ్చిమ బెంగాల్‌లో గురువారం జరిగిన ఆరవ తుది విడత అసెంబ్లీ ఎన్నిల్లో సాయం త్రం 5 గంటల వరకు 84 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూర్పు మిడ్నపూర్ జిల్లాలో 85.09 శాతం పోలింగ్ నమోదు కాగా, కూచ్ బిహార్ జిల్లా లో 82.71 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయం త్రం 5 గంటల వరకు మొత్తంమీద సగటున 84.24 శాతం పోలింగ్ జరిగింది. ఎన్నికల ప్రక్రియకు అడ్డు తగలడంతో పాటు ఎన్నికల సిబ్బందిని బెదిరించినందుకు కూచ్ బిహార్‌లో ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థు లు ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురయ్యారు. సంబంధిత రిటర్నింగ్ అధికారుల ఫిర్యాదుతో నటబారి టిఎంసి అభ్యర్థి రబీంద్రనాథ్ ఘోష్, దిన్‌హటా అభ్యర్థి ఉదయ్ గుహాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. అలాగే దిన్‌హటా నియోజకవర్గంలో గుహా పోలింగ్‌బూత్‌లోపల ఓటు వేసే చోటుకు వెళ్లకుండా అడ్డుకోవడంలో విఫలమైనందుకు ప్రిసైడింగ్ అధికారిని సైతం ఇసి తొలగించింది. తూర్పు మిడ్నపూర్ జిల్లా మోయ్నా నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో స్థానిక సమస్యలపై నిరసనగా కొంతమంది ఓటింగ్‌ను బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు. గురువారం మొత్తంమీద 30 మందిని అరెస్టు చేశామని, వీరిలో 29 మందిని ముందుజాగ్రత్త చర్యకింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటిసారి కూచ్ బిహార్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న 9,776 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

chitram పశ్చిమ బెంగాల్‌లో గురువారం జరిగిన తుదిదశ పోలింగ్‌లో
ఓటువేసేందుకు బారులు తీరిన ఓటర్లు