జాతీయ వార్తలు

రావత్‌కు సిబిఐ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: వివాదాస్పద స్టింగ్ సిడిపై ప్రాథమిక విచారణకోసం తన ముందు హాజరు కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌కు సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం కోసం ఒక మధ్యవర్తితో రావత్ మాట్లాడుతున్నట్లు ఈ సిడిలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం విచారణకు హాజరు కావలసిందిగా రావత్‌కు పంపించిన సమన్లలో సిబిఐ ఆదేశించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు సిబిఐ విచారణకు ఆదేశిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్టప్రతి పాలనలో ఉన్న విషయం విదితమే. ఒక జర్నలిస్టుతో కాని ఒక ఎమ్మెల్యేతో కాని భేటీ కావడం నేరం కాదని ఇదివరకే ప్రకటించిన రావత్.. ఆ వీడియోలో చూపించిన సంభాషణ అర్థంపర్థం లేనిదని తోసిపుచ్చారు. ఉత్తరాఖండ్‌లో ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బిజెపి పన్నిన నేరపూరిత కుట్రలో భాగమే స్టింగ్ ఆపరేషన్, ఆ స్టింగ్ సిడిపై సిబిఐ దర్యాప్తు అని రావత్ ఆరోపించారు. తాను నేరం చేసినట్లు తేలితే తనను జైలులో పెట్టాలని ఆయన ప్రధాని మోదీకి, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు సవాలు విసిరారు.