జాతీయ వార్తలు

రాష్టప్రతి అభ్యర్థి త్వరలోనే వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: కొత్త రాష్టప్రతి అభ్యర్థి ఎంపికపై ఈ నెల 24లోగా స్పష్టత ఇస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 24న విదేశీ పర్యటనకు వెళ్లేలోగానే కొత్త రాష్టప్రతి అభ్యర్థి పేరు ఖరారవుతుందని తెలిపారు. ముగ్గురు సీనియర్ మంత్రులతో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అన్ని పార్టీల నాయకులతో సంప్రదింపులు జరిపి వారి మద్దతు కోరుతుందని ఆయన చెప్పారు. దేశ ప్రజలు గత ఎన్నికల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్టప్రతి అభ్యర్థి ఎంపికపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. రాష్టప్రతి ఎంపికకు ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కృషి చేస్తామని, ఈ అంశంపై రాజకీయ పార్టీలు ఏవైనా సలహాలు ఇస్తే తీసుకుంటామన్నారు. ఈ నెల 18నుండి అన్ని పార్టీలతో చర్చలు ప్రారంభిస్తామని తెలిపారు.
ఇలావుండగా, కొత్త రాష్టప్రతి ఎంపిక గురించి ప్రతిపక్షాలు, ఎన్‌డిఏ మిత్రపక్షాలతో చర్చించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన అమిత్ షా, మంగళవారం కమిటీ సభ్యుడు సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాష్టప్రతి అభ్యర్థి ఎంపికపై ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని బైట పెట్టకుండానే కొత్త రాష్టప్రతి ఎంపిక గురించి ప్రతిపక్షాలతో చర్చలు జరిపేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారు. రాష్టప్రతి ఎంపిక ప్రక్రియలో ప్రతిపక్షాలతో చర్చించలేదనే ఆరోపణలు రాకుండా చూసుకునేందుకే బిజెపి ఈ కమిటీని ఏర్పాటు చేసిందనే మాట వినిపిస్తోంది.
కాగా కొత్త రాష్టప్రతి ఎంపిక గురించి అధికార పక్షంతో చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటుచేసిన మిత్రపక్షాల సీనియర్ నాయకుల కమిటీ రేపు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. అధికార పక్షంతో చర్చలు జరిపే సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనేది ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. రాష్టప్రతి పదవికి పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, జె.డి(యు) సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ పేర్లు ప్రతిపక్షం పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షం కమిటీ ఈ పేర్లను అమిత్ షా ఏర్పాటు చేసిన త్రి సభ్య కమిటీ ముందు ప్రతిపాదించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
జూలై 12 నుంచి పార్లమెంటు
కొత్త రాష్టప్రతిని ఎన్నుకునేందుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 12 నుండి ఆగస్టు 12వ తేదీ వరకు జరుగనున్నాయి. రాష్టప్రతి ఎన్నిక ఏకగ్రీవం కానిపక్షంలో జూలై 17న పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించటం తెలిసిందే. కొత్త రాష్టప్రతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ తేదీని దృష్టిలో పెట్టుకునే పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జూలై 12 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిసింది.