జాతీయ వార్తలు

ఎన్‌హెచ్‌ఆర్‌సి సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈనెల 22న జరిగిన ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ పరిస్థితులపై కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శికి, తెలంగాణ ప్రధాన కార్యదర్శికి, హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తు నోటీసులు జారీచేసింది. మీడియా కథనాలు అధారంగా సుమోటాగా స్వీకరిస్తూ, వర్శిటిలో నీరు, ఆహారం, విద్యుత్, ఇంటర్‌నెట్, ఎటిఎం, తదితర సదుపాయాలు అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్న కథనాలను ఎన్‌హెచ్‌ఆర్‌సి పరిగణనలోకి తీసుకుంది. 25 మంది విద్యార్ధులను, ఇద్దరు అధ్యాపకులను అరెస్టు చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడంతో యూనివర్శిటీ విద్యార్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని పేర్కొంది. యూనివర్శిటీ అధికారులపై పోలీసులు వ్యవహరించిన తీరు విద్యార్థుల రక్షణ, భద్రతపై మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక చర్యలతో నీరు, ఆహారం , విద్యుత్ లాంటి ప్రాధమిక అవసరాలను విద్యార్థులకు నిరోధించడం సమంజసం కాదని కమిషన్ అభిప్రాయపడింది. ఈ అంశంపై వారంలోగా నివేదిక సమర్పించాలని కేంద్రానికి, తెలంగాణకు నోటీసులు జారీ చేసింది . హెచ్‌సియూ వీసీగా అప్పారావు తిరిగి బాధ్యతలు స్వికరించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం వీసీ కార్యాలయాన్ని ముట్టడించినప్పుడు విద్యార్థులపై లాఠీచార్జి, 25మంది విద్యార్థులు ఇద్దరు అధ్యాపకులను అరెస్టు చేయడం పాటు వర్శిటీ మెస్ మూసివేసిన విషయం తెలిసిందే.